ప్రతి ఆడపిల్లా చదవాల్సిన గుండెను తట్టే బిగ్ బీ లేఖ(వీడియో)

Amitabh Bachchan wrote a letter to his grand daughters

04:20 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan wrote a letter to his grand daughters

గతంలో స్వాతంత్ర్య సమరంలో సమరవీరులు జైలుకి వెళితే, తమ పిల్లలకు, కుటుంబానికి లేఖలు రాసేవారు. ఆలేఖలు చదివితే, ఎంతో నాలెడ్జ్, జీవిత సత్యం తెలిసేదట. పండిట్ నెహ్రు జైలులో ఉండగా రాసిన లేఖలు ఆయన కుమార్తె ఇందిరా గాంధీపై ఎంతో ప్రభావం చూపాయి. అందుకే ఉక్కు మహిళగా భారత దేశాన్ని సమర్ధవంతంగా పాలించడానికి ఈ లేఖలు దోహదం చేశాయని అంటారు. ప్రస్తుతం లేఖల ఊసే కనిపించడం లేదు. అన్నీ మెసేజ్ లే. ఇక తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన మనవరాళ్లకు అందరి హృదయాలను టచ్ చేసే విధంగా ఒక అద్భుతమైన లేఖ రాసాడు.

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ల కూతురు ఆరాద్యతోపాటు నిఖిల్, శ్వేతా నందాల పుత్రిక నవ్య నివేలిలకు సంయుక్తంగా బిగ్ బి అందించిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ముఖ్యంగా వాళ్లు తమ జీవితంలో ఎలా మెలగాలనే సూచనలు బిగ్ బి చేసాడు. ఈ లేఖ ఆయన తన మనవరాళ్లకు మాత్రమే రాయలేదు, భారత దేశంలో ఉన్న అందరి మనవరాళ్లను ఉద్ధేశించి రాస్తున్నట్టు చెప్పాడు. నిజానికి ఈ లేఖ ప్రతి ఆడపిల్లా చదవాల్సిన లెటర్ అని నెటిజన్లు కూడా అంటున్నారు. ఈ సందేశాన్ని రాసిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నారు. అంతేకాదు దీంతో తృప్తి చెందకుండా ఆ లెటర్ ను పెద్దగా చదివి రికార్డ్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేయడం విశేషం.

1/4 Pages

లెటర్ సారాంశం ఇదే..


డియర్ నవ్య, ఆరాద్య తెలియని వ్యక్తుల నుంచే కాదు, తెలిసిన వ్యక్తుల నుంచి కూడా ప్రమాదాలు ఎదురవుతాయి. ఇద్దరూ మీ సొంత నిర్ణయాలు తీసుకోండి, ఇతరులు ఏం చెబుతున్నారనే దాని గురించి ఎప్పుడూ పట్టించుకోవద్దు. మీరు ఎలా ఉండాలో, ఏ దుస్తులు ధరించాలో, ఎక్కడికి వెళ్లాలో ఇలా అన్ని అభిప్రాయాలు మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు స్వతంత్రులుగా ఉండండి. మీ పుట్టుకతోనే మీకు దక్కిన గుర్తింపు, ఇంటిపేర్ల ద్వారా వచ్చిన పాపులారిటీ మిమ్మల్ని కాపాడలేవు. మీరు ఎదుర్కొనే కష్టాలను అవి తగ్గించలేవు ఎందుకంటే మీరు మహిళలు కాబట్టి. ఈ ప్రపంచంలో మహిళలుగా ఉండటం చాలా కష్టం.

English summary

Amitabh Bachchan wrote a letter to his grand daughters