అమితాబ్ ఫెయిల్ అయ్యాడా!!    

Amitabh Bachchan's first film audition photo

05:18 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan's first film audition photo

అవును సూపర్ స్టార్ అమితాబ్ ఫెయిలయ్యాడట. ఫెయిల్ అవ్వడం సహజమే. కానీ బిగ్ బి మాత్రం ఫెయిల్ అయినా అనూహ్య విజయాలను అందుకున్నాడు. వివరాల్లోకి సినిమాల్లోకి రావాలనే కోరికతో బిగ్‌ బీ అమితాబ్‌ ఆడిషన్స్‌కి పంపిన మొదటి ఫొటో ఎంపిక కాలేదట. ఈ ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి నాటి రోజులను అమితాబ్ గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో ఫిలింఫేర్‌ మాధురి కాంటెస్ట్‌లో ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలుసుకుని ఈ ఫొటో పంపాడట. 'మరి ఇలాంటి ఫొటో ఆడిషన్స్‌కి పంపితే ఎవరు ఎంపిక చేస్తారు. ఎంపిక కాకపోవడంలో ఆశ్చర్యమేముంది' అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. మొత్తానికి బాలీవుడ్ లో తెరుగులేని నటుడై, సక్సెస్ అందుకున్న అమితాబ్ ఆలిండియా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు.

English summary

Bollywood Big B Amitabh Bachchanan old picture of his from his struggling days on Twitter, Big B revealed that this was the photograph that led to his rejection from a talent hunt.