బిహారీ బాబు జీవిత కధను ఆవిష్కరించిన బిగ్ బి

Amitabh Launches Shatrughan Sinha Biography

09:35 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Amitabh Launches Shatrughan Sinha Biography

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, బిహారీ బాబు శతృఘ్న సిన్హా జీవితకథ ‘ఎనీథింగ్‌ బట్‌ కామోష్‌’ పుస్తకాన్ని బాలీవుడ్‌ నటుడు బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆవిష్కరించాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖుల మధ్య ఆవిష్కరణ జరిగింది. అమితాబ్‌, శతృఘ్నసిన్హా బాలీవుడ్‌ చిత్రసీమలో మంచి స్నేహితులు, వీరిద్దరూ కలిసి దోస్తానా, కాలా పత్తర్‌ వంటి అనేక సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. స్నేహితుడి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అమితాబ్‌ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి శతృఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా కూడా పాల్గొంది.

English summary

Bollywood Big B Amitabh Bachchan launches Actor And Politician Shatrughan Sinha Biography.This book was launched February 19.The name of Shatrughan Sinha biography called Anything But Khamosh in Mumbai.