తమిళనాట 'అమ్మ కాల్ సెంటర్లు'

Amma Call Centers On Tamilnadu

06:14 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Amma Call Centers On Tamilnadu

ప్రజాకర్షక పధకాలు ప్రవేశపెట్టి, ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెల్సుకుంటూ , పాలన సాగించడంలో తనకు తానే సాటి అన్పించుకున్న పురుచ్చి తలైవి - తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సరికొత్త పధకం ఆవిష్కరించారు. తమిళనాడులో అమ్మ పేరుతో ఇప్పటికే అమ్మ క్యాంటీన్‌, అమ్మ సిమెంట్‌, అమ్మ ఫార్మసీ, అమ్మ వాటర్‌, అమ్మ ఉప్పు తదితర పథకాలు ఉండగా, ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా 'అమ్మ కాల్‌సెంటర్‌ చేరింది. మంగళవారం అమ్మ కాల్‌ సెంటర్లను ప్రారంభించారు. ఈ కాల్‌సెంటర్లకు 1100 టోల్‌ఫ్రీ నంబరు కేటాయించారు. ఈ కాల్‌సెంటర్లు 24 గంటలు, 365 రోజులు పనిచేస్తాయని తెలిపారు. ప్రజలు అమ్మ కాల్‌సెంటర్లకు ఫోన్‌ చేసి వివిధ రకాల సమస్యలకు పరిష్కారం పొందవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. సమస్యపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు సమాచారం అందిస్తారు. ఇటీవల సంక్రాంతికి 100 రూపాయల నగదుతో పాటూ, నిత్యావసర వస్తువులు కూడా అందించిన జయ , ఇలా సంక్రాంతి గడించిందో లేదో అప్పుడే కొత్త స్కీం గా 'అమ్మ కాల్ సెంటర్' వచ్చేసింది.

English summary

Tamilnadu Cheif Minister Jaya Lalitha introduced a new scheme called "Amma Call Center" .The tollfree number of that call center was 1100. With the use of this call center we can solve our problems