రూ. 10 టికెట్ తో సినిమా చూపిస్తోన్న అమ్మ

Amma cinema halls in Chennai

11:06 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Amma cinema halls in Chennai

పురుచ్చి తలైవి అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఎవరంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితే. తమిళనాట అమ్మగా కొలువబడే ఈ అమ్మ పధకాలతో ప్రజలను ఆకర్షించడంలో దిట్ట. నిజానికి ఈమె ప్రవేశపెట్టే పథకాలను ఎవరూ ఊహించలేరేమో. ఆమె తీసుకొచ్చే ఉచిత పథకాలు - రాయితీ పథకాలు అన్నీ ప్రజలను విపరీతంగా అట్రాక్టు చేసేస్తాయి. తాజాగా తమిళులను ఆమె మరో పథకంతో ఫ్లాట్ చేసేందుకు రెడీ అయ్యారు. సినీ రంగం నుంచి వచ్చిన ఈమెకు ప్రజలకు సినీ మోజు ఎంత పర్శంటేజ్ వుందో బాగా తెలుసు. ప్రజలు నాడి తెలిసిన ఈ అమ్మ బుర్రలోంచి వచ్చిన ఐడియా ఇప్పుడు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయిస్తున్నాయి.

ఇప్పటికే ఫోన్లు - ల్యాప్ టాప్ లు - మిక్సీలు - ఫ్యాన్లు - గ్రైండర్లు వంటివన్నీ ఫ్రీగా ఇచ్చిన జయ ఇప్పుడు మరింత వినోదాన్ని వారికి చేరువ చేయబోతున్నారు. అసలే సినిమాలంటే పడి చచ్చే తమిళులకు అతి తక్కువ ధరకే సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్నారామె. మల్టీప్లెక్స్ - మాల్స్ సంఖ్య పెరిగిపోవడంతో తమిళనాడులో సినిమా టిక్కెట్ల ధరలు భారీగా ఉన్నాయి. చిత్రాలు చూడాలంటే రూ. 125 చెల్లించాల్సి వుండటంతో జయలలిత పేదల కోసం అమ్మ సినిమా హాల్స్ కాన్సెప్టును తెర మీదికి తెచ్చారు. వాస్తవానికి చెన్నైలోని మల్టీప్లెక్సుల్లో తెరముందు ఒక వరుస సీట్లు రూ. 10కే విక్రయిస్తున్నప్పటికీ సీట్ల సంఖ్య చాలా తక్కువ కావడంతో పేదలు వినోదాన్ని పొందలేకపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.

దీంతో ఆమె మూడు కేటగిరీల్లో చవక ధరల టిక్కెట్లతో థియేటర్లే అందుబాటులోకి తెస్తోంది. అమ్మ సూచనల మేరకు చెన్నై కార్పొరేషన్ కనుసన్నల్లో నడిచేలా రెండు థియేటర్లు ప్రారంభమయ్యాయి. టీ నగర్ - పెనాయ్ నగర్ లో భారీ థియేటర్లను సర్కారు సిద్ధం చేసింది. దాదాపు 3 వేల మంది ఒకేసారి సినిమా చూసేలా పెనాయ్ నగర్ - కలై అరంగం హాల్ ను రూ. 17 కోట్లకు పైగా వెచ్చించి మార్పులు చేర్పులు చేశారు. ఇక్కడ టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 30 మధ్య మూడు క్లాసులుగా ఉంటుంది. డీటీఎస్ వంటి సదుపాయాలూ ఉంటాయి. వీటితో పాటు ముగప్పేర్ - చేట్ పట్ ప్రాంతాల్లోనూ అమ్మ హాల్స్ నిర్మించే యోచనలో సర్కారు ఉంది.

కాగా ఇప్పటికే రికార్డు స్థాయిలో వరుసగా రెండోసారి అధికారం అందుకున్న జయ ఇలాంటి ప్రజాకర్షక పథకాలకు తెరతీస్తే ఇక తమ పని ఆఖరే అని అక్కడి విపక్షాలు టెన్షన్ పడుతున్నాయి. మొత్తానికి అమ్మ జనానికి కాకుండా విపక్షాలకు సినిమా చూపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

English summary

Amma cinema halls in Chennai