పుట్టను శుభ్రం చేస్తుంటే... ఏం బయటపడిందో తెలుసా?

Ammavaari statue found while cleaning anthill

10:46 AM ON 5th November, 2016 By Mirchi Vilas

Ammavaari statue found while cleaning anthill

నాగుల చవితి సందర్భంగా చాలామంది పుట్టల దగ్గరకు వెళ్లి పాలు పోశారు. పుట్టల దగ్గరకు వెళ్ళాక అక్కడ చెత్తా చెదారం, తుప్పలు తొలగించి శుభ్రం చేయడం సహజం. అలాగే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీ వద్ద పుట్ట శుభ్రం చేస్తున్నారు. ఈలోగా అక్కడ అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. గురువారం ఉదయం నాగులచవితి సందర్భంగా పశువుల ఆసుపత్రి సమీపంలో పుట్టల కోసం తుప్పలను సరిచేస్తుండగా ఒక పుట్ట వద్ద పలుగుకు ఈ విగ్రహం తగిలింది. పుట్టను తవ్వి చూడగా అమ్మవారి విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు.

నాగులచవితి రోజున దేవతా విగ్రహం బయటపడటంతో భక్తులు పెద్ద సంఖ్యలో చూడటానికి తరలివచ్చారు. పసుపు, కుంకుమ రాసి పూజలు చేశారు. అమ్మవారి ఆకారాన్ని బట్టి లక్ష్మీదేవని, నాగులచవితి రోజు లభించింది కనుక నాగమ్మ అని భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు అమ్మవారిని పూజించారు.

English summary

Ammavaari statue found while cleaning anthill