‘అంపశయ్య’ షూటింగ్ పూర్తి

Ampasayya Movie Completes Shooting

10:38 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Ampasayya Movie Completes Shooting

న‌ర్సాపూర్ అడ‌వులు, వ‌రంగ‌ల్ రామ‌ప్ప గుడి, ఉస్మానియా యూనివర్సిటీ త‌దిత‌ర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిపిన‘’అంపశయ్య" సినిమా ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ‘అమ్మా నీకు వంద‌నం’ చిత్రం ద్వారా అద్దె త‌ల్లుల(స‌రోగేట్ మ‌ద‌ర్స్‌) హృద‌య‌వేద‌న‌ను తెర‌కెక్కించిన . ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ జైని ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌ల‌క్ష్మి జైని నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అంప‌శ‌య్య‌`. కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాత ఉస్మానియా యూనివ‌ర్సిటిలో అంప‌శయ్య చిత్రం షూటింగ్ జ‌రుపుకుంది జైనీ క్రియేష‌న్స్‌, ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్యామ్ కుమార్‌, పావ‌ని హీరో హీరోయిన్స్ గా న‌టించారు. 1970ల్లో వచ్చిన ‘’అంపశయ్య” నవల. అప్పట్లో గొప్ప సంచలనం సృష్టించింది. న‌వ‌ల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సుప్ర‌సిద్ధ ర‌చ‌యిత అంప‌శ‌య్య న‌వీన్ తీర్చిదిద్దిన ఏళ్ళనాటి క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం ఓ సాహ‌సమే. ఎందుకంటే ఈ నవలను సినిమాగా తీయాలని చాలామంది ప్రఖ్యాత దర్శకులు ప్రయత్నించినా, ఎందుకో ఆ కల నిజం కాలేదని నవలా రచయిత నవీన్ చెప్పారు. ఈ నేపథ్యంలో, ఈ చిత్రాన్ని నిర్మించాలనే తపనతో కృషి చేస్తి ప్రభాకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఒక ప్రభావవంతమైన పాత్రలో ఆకెళ్ళ రాఘవేంద్ర నటించగా, ఐఏఎస్ అభ్య‌ర్థుల‌కు వ్య‌క్తిత్వ వికాస శిక్ష‌ణ త‌ర‌గ‌తులు చెప్పే సిటీకి చెందిన తెలంగాణ ప్ర‌జా కళాకారుడు కిన్నెర మొట్ల మొగిల‌య్య‌, , స్వాతి నాయుడు, యోగి దివాన్‌, వాల్మీకీ, మోనికా థాంప్స‌న్ స‌హా థియేట‌ర్ ఆర్ట్స్ విద్యార్థులు కొంద‌రు, చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని దంపతులు కూడా ఈ చిత్రంలో నటించారు. త్వరలో విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

English summary

Director Prabhakar Jainy's new film AMpasayya movie shooting was completed in Hyderabad.This was said by the movie unit.This Ampasayya movie was produced by Vijayalakshmi Jainy.This movie was based on a Novel which has released in the year 1970.Shyam Kumar and Pavani acted as hero heroines in this movie