ప్రభాస్ తరువాత సినిమా హీరోయిన్, విలన్ వీరే!

Amy Jackson and Neil Nitin Mukesh was selected for Prabhas next movie

05:18 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Amy Jackson and Neil Nitin Mukesh was selected for Prabhas next movie

'రన్ రాజా రన్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఓ చిత్రాన్ని చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ స్నేహితులు యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇందులో హీరోయిన్, విలన్ ల క్యారెక్టర్ల కోసం ఎవరిని ఎంపిక చేశారో యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రంలో బ్రిటీష్ హాట్ బ్యూటీ అమీ జాక్సన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.

గతంలోనూ అమీ జాక్సన్ ని కథానాయికగా ఎంపిక చేసినట్లుగా వార్తలొచ్చాయి. అయితే.. అప్పుడు దీని పై యూనిట్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఆమెనే ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ని ఎంపిక చేసుకున్నారు. క్యాస్టింగ్ ని బట్టి చూస్తుంటే.. ఈ చిత్రంలో యాక్షన్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి: ది కన్ క్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఆగస్ట్ లో షూటింగ్ ముగించుకుని కొద్ది రోజులు విరామం తీసుకున్నాక.. తన తదుపరి చిత్రం పై ప్రభాస్ దృష్టి పెడతారని సమాచారం.

English summary

Amy Jackson and Neil Nitin Mukesh was selected for Prabhas next movie