'రోబో 2.0' లో అమీజాక్సన్‌ పాత్ర లీక్

Amy Jackson role leaked from Robo 2

12:07 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Amy Jackson role leaked from Robo 2

దర్శక దిగ్గజం శంకర్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'రోబో 2.0'. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ సరసన అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న అమీజాక్సన్‌ పాత్ర చెన్నై సినీ వర్గాలు ద్వారా లీకైంది. ఇందులో అమీజాక్సన్‌ ఒక ఆడ రోబో గా కనిపించనుందట. రజనీకాంత్‌ కు అసిస్టెంట్‌ గా ఉంటూ రజనీకి సలహాలు ఇస్తూ ఉండే ఆడ రోబో గా అమీజాక్సన్‌ కనిపించనుంది. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర ఘాటింగ్‌ చెన్నైలోని ఇవిపి ఫిల్మ్‌సిటీ లో జరుగుతుంది. అయితే రజనీకాంత్‌ మాత్రం ఈ ఘాటింగ్‌ లో పాల్గొనడం లేదు. 'కబాలి' కోసం మలేషియా వెళ్లిన రజనీకాంత్‌ ఆ చిత్రం ఘాటింగ్‌ అయిపోగానే వచ్చే నెలలో 'రోబో 2.0' ఘాటింగ్‌లో పాల్గొంటారు. ప్రస్తుతం రజనీ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఏ .ఆ.ర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

English summary

British beauty Amy Jackson role leaked from Robo 2.0 movie. She is acting as a lady robot in this movie. Shankar is directing this movie.