రవితేజతో సై అంటున్న 'ఐ' హీరోయిన్‌!!

Amy Jackson want to act with Raviteja

06:01 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Amy Jackson want to act with Raviteja

మాస్‌ మహరాజ్‌ రవితేజ తాజాగా నటించిన చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. డిసెంబర్‌ 10న విడుదలయిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ సంపాదించుకుంది. అయితే రవితేజ బెంగాల్‌ టైగర్‌ చిత్రం విడుదలకాక ముందే మరో మూడు సినిమాలును లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. అందులో ఒకటి 'దోచేయ్‌' ఫేమ్‌ సుధీర్‌ వర్మతో ఒక చిత్రం, రెండవది దిల్‌రాజు-వేణు శ్రీరాం కాంబినేషన్‌లో రానున్న ఎవడో ఒకడు, మూడోది చక్రి అనే నూతన దర్శకుడితో ఒకటి. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ-చక్రి కాంబినేషన్‌లో వచ్చే చిత్రానికి రవితేజ సరసన 'ఐ' హీరోయిన్‌ అమీ జాక్సన్‌ను ఎంపిక చేశారు.

ఇటీవలే ఈ చిత్రం టీమ్‌ అమీజాక్సన్‌ని సంప్రదించారు. అయితే అమీజాక్సన్‌ ఖాతలో 'రోబో-2' తో పాటు మరో కొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే రవితేజ సినిమా కథ నచ్చడంతో దీంతో తన డేట్స్‌ ఎలా అడ్జస్ట్ చెయ్యాలో అర్ధంకాక సతమతమవుతుందట. ఈ అమ్మడు త్వరలోనే డేట్స్‌ సర్దుబాటు చేసి రవితేజ సినిమా పై క్లారిటీ ఇస్తానని చెప్పిందిట అమీజాక్సన్‌.

English summary

Amy Jackson want to act with Raviteja in his new movie.