నేను చాలా రొమాంటిక్

Amy Jackson Wants To Act With Salman Khan

11:23 AM ON 12th April, 2016 By Mirchi Vilas

Amy Jackson Wants To Act With Salman Khan

బార్బీగర్ల్‌ ' అమీ లూయిస్‌ జాక్సన్‌' దక్షిణాది, బాలీవుడ్‌ సినిమాల్లో నటించి కుర్రకారు డ్రీమ్‌గాళ్‌గా నిలిచింది. ‘ఏక్‌ దివానా థా’, ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌’ ‘ఎవడు’ ‘తాండవం’, ‘2.0’ (తమిళం)లాంటి హిందీ, తెలుగు, తమిళం సినిమాల్లో అందాలబొమ్మ నటించింది. కలలు కనడం అలవాటైన ఈ బ్యూటీకి వాటిని నిజం చేసుకోవడం తెలుసు. ఆమె మనసులోని మాటలను ఇటీవల పంచుకుంటూ, 'సల్మాన్‌ మంచి హీరో. అతనితో పనిచేయాలని ఉంది. అలాగే వరుణ్‌ ధావన్‌తో , షారుక్‌ఖాన్‌తో చేయాలని ఉంది. దక్షిణాదిన అయితే అజిత, ప్రభా్‌స...ఇంకా చాలామంది హీరోల జాబితానే ఉంది.' అని అంటోంది.

ఇవి కూడా చదవండి:ఆమెకు 41- అతనికి 23- ఇద్దరినీ కలిపింది ఫేస్ బుక్

' నేను చేసే ప్రతి పనిని ఇష్టపడతా. సినిమాల్లో అవకాశాలు రావడం నా అదృష్టం' 'ఇంకా చెప్పాలంటే నటించడాన్ని నేను ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నా. రొమాంటిక్‌ నటన చేయాల్సివస్తే చేయడానికి సిద్ధం. ఈ వారం ఢిల్లీ వెళ్లాం. అక్కడ కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఇంటర్నేషనల్‌ స్టంట్‌ ఆర్టిస్టుల పర్యవేక్షణలో షూట్‌ చేశాం. ఆ యాక్షన్‌ సీక్వెన్సులు చేసేటప్పుడు మరిన్ని యాక్షన్‌ మూవీలు చేయాలనిపించింది. ఇంకా చెప్పాలంటే యాక్షన్‌ చిత్రాలు చేయాలనిపించింది కూడా. కానీ వ్యక్తిగా అన్నింటిలోనూ ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా. నేను ఎంతో రొమాంటిక్‌ ఫెలోని కూడా. స్ర్కీన్‌ మీద ఆ యాక్షన్‌ని కూడా పండించగలను"అని వివరించింది.

ఇవి కూడా చదవండి:

24లో నాలుగు పాత్రల్లో సూర్యనే..

కోర్టు దగ్గరే భార్య గొంతు కోసేశాడు

English summary

Heroine Amy Jackson has got fame with the movies like I,Yevadu,Singh Is Bling,Thandavam,Ek Dewana Tha. She says that she was reday to to Romantic Scenes and She want's to act with Salman Khan.