'జాకీచాన్‌'తో బాలీవుడ్‌ బ్యూటీ..

Amyra Dastur acting in Jackie Chan movie

07:07 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Amyra Dastur acting in Jackie Chan movie

ధనుష్‌ నటించిన అనేగన్‌(అనేకుడు) చిత్రంతో తమిళం మరియు తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్‌ బ్యూటీ 'అమైరా దస్తర్‌' ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇందులో ఒకటి పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న 'రోగ్‌' చిత్రం కాగా మరొకటి మంచు విష్ణు సరసన నటిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ హాట్ బ్యూటీ 'జాకీచాన్‌' సరసన నటించే అవకాశం అందుకుంది. అయితే తొలుత ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా చెయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ అవకాశం అమైరాని వరించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించి యాక్షన్‌ పార్ట్‌ మొత్తం పూర్తియింది.

ఇప్పుడు జాకీచాన్‌తో సాగే కొన్ని కీలక సన్నివేశాల కోసం అమైరా దస్తర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు 'సోనూసూద్‌' కూడా నటించడం విశేషం. జాకీచాన్‌ కి ఉన్న ఫాలోయింగ్‌ బట్టి అమైరా దస్తర్‌ పేరు ప్రపంచమంతా మారు మ్రోగబోతోందనడంలో సందేహం లేదు.

English summary

Bollywood beauty Amyra Dastur acting in Jackie Chan movie. And also Sonu Sood also acting in Jackie Chan movie.