ఏజ్ మ్యాచ్ తో ఆ హీరోయిన్ ఖుషీ ఖుషీ...

Amyra Dastur happy with Raj Tarun

01:26 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Amyra Dastur happy with Raj Tarun

మరో ముంబై భామ టాలీవుడ్ లోకి రాబోతోంది. అదికూడా చాలా చాలా సొంతషంగా వస్తోందట. ఇంతకీ ముంబై భామ ఎవరంటే, అమైరా దస్తూర్... అవును, గతేడాదే ఈ చిన్నది టాలీవుడ్ తెరపై మెరవాల్సి ఉన్నా, ఓ భారీ ఆఫర్ రావడంతో తప్పుకుంది. ఇప్పడు తెలుగు సినిమా అరంగేట్రం ఖాయమైంది. ఇంతకీ ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మకి.. అమల అక్కినేనికి తాను పెద్ద ఫ్యాన్ అట. పూరీ జగన్నాథ్ తీస్తున్న ఓ సినిమా కోసమే కాకుండా.. మంచు విష్ణు సరసన కూడా ఓ మూవీని అమైరా వదులుకుంది. ఆ ప్రాజెక్టులు చేయాల్సిన సమయంలో జాకీచాన్ మూవీ 'కుంగ్ ఫూ యోగా'లో ఛాన్స్ రావడంతో, పూరీ - మంచు విష్ణుల సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు మాత్రం తన వయసుకు మ్యాచ్ అయ్యే హీరోతో మొదటి సారి చేసే ఛాన్స్ వచ్చిందని సంబరపడిపోతోంది. రాజ్ తరుణ్ నా కంటే వయసులో ఒక సంవత్సరం మాత్రమే పెద్ద. మొదటిసారిగా నా వయసుకు తగిన హీరోతో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ నిర్మాణ సంస్థతో గతేడాదే ఓ సినిమా చేయాల్సి ఉంది. జాకీ చాన్ సినిమా కోసం ఇది వదులుకున్నా. దీంతోపాటే పూరీ జగన్నాథ్ సినిమా కూడా. అయితే తప్పకుండా ఆయా నిర్మాణ సంస్థలకు మళ్లీ చేస్తానని చెప్పా. ఇప్పుడు రాజ్ తరుణ్ సినిమా కోసం వాళ్లే అడిగారు. అలా నా ఏజ్ హీరోతో నటించే ఛాన్స్ మొదటిసారి వచ్చింది అని సంబర పడుతూ అమైరా దస్తూర్ చెబుతోంది.

అసలీ సినిమా ఒప్పుకోవడానికి కారణం స్క్రిప్ట్ అని అమైరా చెబుతున్నా, తెలుగు సినిమాలు బాలీవుడ్ కి సరిసమానంగా ఉంటాయని, ఒకోసారి వాటిని మించి కూడా తీస్తుంటారని అంటోంది.

English summary

Amyra Dastur happy with Raj Tarun