'జాకీచాన్‌'తో కలిసిన ధనుష్‌ హీరోయిన్‌!!

Amyra Dastur joins Jackie Chan movie shooting

12:24 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Amyra Dastur joins Jackie Chan movie shooting

ధనుష్‌ నటించిన అనేకుడు (అనేగన్ తమిళం) చిత్రంతో కోలీవుడ్‌ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తర్‌. ఈ చిత్రం లో తన అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకుంది. ఈ చిత్రం తరువాత తెలుగులో పూరీజగన్నాధ్ తెరకెక్కిస్తున్న 'రోగ్‌' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్‌ హీరో జాకీచాన్‌ నటిస్తున్న 'కుంగ్‌ఫూయోగా' చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. తొలుత జాకీచాన్‌తో హీరోయిన్‌ గా కత్రినాకైఫ్‌, ఇలియానాలను సంప్రదించగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా లో నటించలేకపోయారు. ఆ తరువాత ఆ అవకాశం అమైరాను వరించింది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం బీజీంగ్‌ లో జరుగుతుంది. నిన్ననే ఈ షూటింగ్‌ లో అమైరా కూడా జాయిన్‌ అయింది. ఈ సందర్భంగా అమైరా మాట్లాడుతూ ఈ చిత్రంలో నాకు కొన్ని ఫైటింగ్‌ సీన్స్‌ ఉన్నాయి. అందుకోసం వారం రోజులు పాటు శిక్షణ కూడా తీసుకున్నాను. జాకీచాన్‌ వంటి అగ్రహీరోతో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది.

English summary

Amyra Dastur joins Jackie Chan movie shooting. The movie title is Kung Fu Yoga.