ఆ డాక్టర్ వంద మందికి హెచ్ఐవి అంటించాడు

An Illegal Doctor Arrested For Spreading HIV In Cambodia

06:46 PM ON 4th December, 2015 By Mirchi Vilas

An Illegal Doctor Arrested For Spreading HIV In Cambodia

తన దగ్గరకు వచ్చే రోగులకు హెచ్‌ఐవి ని వ్యాప్తి చేస్తున్న ఒక నకిలీ డాక్టర్‌ను కాంబోడియాలో పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్ళే కాంబోడియాలోని ఒక నకిలీ డాక్టర్‌ తన దగ్గరకు వచ్చే రోగులకు వాడి పడేసిన, లేక హెచ్‌ఐవి ఉన్న సూదులతో వైద్యం చెయ్యడం వాళ్ళ దాదాపు 100 మందికి పైగా ప్రజలను హెచ్‌ఐవి బారిన పడ్డారు .

కాంబోడియా ఆరోగ్య శాఖ వారు మాట్లాడుతూ కాంబోడియా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు చికిత్స చేయించుకోవడానికి ఇలాంటి నకిలీ డాక్టర్ల దగ్గరకు వెళ్ళడమే వారికున్న ఏకైక దారి . కాంబోడియాలో దాదాపు 4,000 మంది అక్రమ లేక నకిలీ డాక్టర్లు ఉన్నారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇలా హెచ్‌ఐవి వ్యాధి గ్రస్తులు ఎక్కువగా రోకర్‌ గ్రామం నుండి రావడంతో దీని పై అధికారులు విచారణ చేపట్టుగా అసలు విషయం బయటకి వచ్చింది.

ఈ నకిలీ డాక్టర్‌ బాగోతం బయట పడడంతో పోలీసులు ఆ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అతడి పై హెచ్‌ఐవి వ్యాప్తి చేస్తుంనందుకు, అక్రమంగా తగిన అనుమతి లేకుండా ఆసుపత్రి నడుపుతున్నందుకు గాను పలు కేసుల పెట్టి , కోర్టులో హాజరుపరచగా కోర్టు ఇతడికి 25 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.

UNAIDS వారి నివేదిక ప్రకారం కాంబోడియా లో 2013 లో 1,300, 2015 లో 3,500 హెచ్‌ఐవి కేసులు నమోదు కాగా ఇప్పుడు దాదాపు 76,000 మందికి హెచ్‌ఐవి ఉన్నట్లు తెలిపారు.

English summary

An Illegal doctor is cambodia has spreaded hiv virus in various patients who came for vaccination. He was arrested by cambodia police and court ordered police to keep him in jail for 25 years