1300 మంది అక్రమ సంతానాన్ని కన్న పోటుగాడు

An Old Man Gives Birth To 1300 People

10:19 AM ON 3rd March, 2016 By Mirchi Vilas

An Old Man Gives Birth To 1300 People

అధిక జనాభా నియంత్రణకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనే నినాదానికి అనుగుణంగా పరిస్థితులు మారాయి. అంతకు మించి ఎక్కువమందిని కన్నా, పోషించడం కష్టం కదా. అయితే చైనాలో ఒక వ్యక్తి 1300 మంది పిల్లలను కన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఓ డిటెక్టివ్ వెల్లడించిన విషయాలు పరిశీలిస్తే, ఆశ్చర్యం కలగక మానదు. పైగా ఇందులో 99% అక్రమ సంతానమే నట. ఇంతకీ ఈ పోటుగాడు ఎవరంటే, ఓ మాజీ పోస్ట్‌మాస్టర్‌ అట. ఇప్పుడు 85 ఏళ్లు వయసుకు చేరుకున్న ఇతని చాటు మాటు రాసలీలలకు ప్రతిఫలమే ఈ అక్రమ సంతానమట. ఆయన రాసలీలల ఫలితంగా 1300 మంది పిల్లలు పుట్టినట్లు డిటెక్టివ్‌ కనిపెట్టాడు. దీనికోసం 15 ఏళ్లపాటు ఎంతో కష్టపడి వేల మంది డీఎన్‌ఏ సేకరించి ఈ రహస్యం బయటపెట్టాడు.

ఇంతకీ ఆ డిటెక్టివ్ ఎందుకిలా చేసాడంటే, 2001వ సంవత్సరంలో తన వద్దకు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వచ్చి డీఎన్‌ఏ శాంపిల్స్‌ ఇచ్చి తమ తండ్రులెవరో కనిపెట్టమన్నారట. ఆశ్చర్యకరంగా వారిద్దరి తండ్రీ ఒకరేనని తెలిసి, అప్పుడు మొదలెట్టిన ఈ ఆపరేషన్ 15ఏళ్ళు కొనసాగింది. తన వద్ద ఉన్న శాంపిల్స్‌లో చాలా ఈ డీఎన్‌ఏతో సరిపోయాయి. ఇప్పటివరకు ఆ వ్యక్తి వల్ల 1,300 మంది ప్రాణం పోసుకున్నట్టు తన పరిశోధనలో తేలిందని డిటెక్టివ్ తేల్చాడు.

అయితే ఇంత జరుగుతున్నా ఈ విషయాన్ని ఆ మాజీ పోస్ట్‌ మాస్టర్‌ ఖండించలేదు. ఆ రోజుల్లో గర్భనిరోధక మాత్రలు గురించి తనకు పెద్దగా అవగాహన లేదని ఓ విలేకరితో నవ్వుతూ చెప్పాడట. 1960ల్లో తన జీవితంలో ఎన్నో మధురానుభూతులున్నాయని, అయినా తను చేసిన పనులకు పశ్చాత్తాప పడటం లేదని అంటున్నాడు. ఏమాత్రం సిగ్గు పడకుండా , తను కాదని తప్పించుకోకుండా, ధైర్యంగా ఒప్పుకోవడమే కాదు, చేసిన మెహర్భానికి ముచ్చట పడుతున్నాడు.

English summary

An old man with the age of 85 years was give birth to 1300 people.According to a Detective agency a post man in China was the reason for the birth of 1300 people by his illegal activities.This was found by an Detective agency in china after 15 years Research.