అత్త పై కోడలి కర్కశత్వం ....

An Old Woman Killed In Uttar Pradesh By Her Daughter in law

01:20 PM ON 12th January, 2016 By Mirchi Vilas

An Old Woman Killed In Uttar Pradesh By Her  Daughter in law

నోటిలో గుడ్డలు కుక్కి , రాడ్ తో కొట్టి , ఉరి సైతం

కోడలిపై అత్త అఘాయిత్యం అనే శీర్షికలు కోకోల్లల్లు .... కానీ అత్తపై కోడలి దురాగతం ఇది. వృద్ధాప్యంలో మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న అత్తగారిపై ఓ కోడలు చూపిన కర్కశత్వం ఇది. సాటి మహిళ అన్న మానవత్వం మార్చిన ఆ కోడలు అత్తగారి నోటిలో గుడ్డలు కుక్కి.. రాడ్‌తో కొట్టి తీవ్రంగా కొట్టింది. అంతటితో ఆగలేదు .... చివరకు ఉరివేసి చంపేందుకు సైతం వెనకాడ లేదు ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే, హృదయం ద్రవిస్తుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నెహ్‌తౌర్‌ ప్రాంతానికి చెందిన రాజరాణి జైన్‌ కుమారుడు సందీప్‌ జైన్‌కు అదే ప్రాంతానికి చెందిన సంగీతతో ఏడేళ్ల కిందట వివాహమైంది. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నడుస్తున్నాయి. విడాకులకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తోంది.

ఇదిలా వుంటే, మరోవైపు సంగీత తన భర్తమీద అదనపు కట్నం కేసు పెట్టింది. ఈ నేఫథ్యంలో కొద్దిరోజులుగా తన అత్త రాజారాణిని కూడా సంగీత హింసిస్తోంది. సందీప్‌ జైన్‌కు ఈ విషయం తెలిసినా ఆధారాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయాడు. ఏదోరకంగా భార్య దాష్టీకాన్ని బయటపెట్టాలనుకున్నాడు.

చివరకు ఓ పథకం వేసి ఆమె సోదరితో కలిసి ఇంట్లో రహస్యంగా సీసీ కెమెరా అమర్చాడు. అది వర్కవుట్ అయింది. ఈ నెల 5న సంగీత తన అత్తపై దాష్టీకానికి పాల్పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న రాజారాణి మంచం మీదకు ఎక్కి.. ఎడాపెడా కొట్టింది. అంతటితో ఆగకుండా వాటర్‌హీటర్‌ రాడ్‌తో దాడిచేసింది. మెడకు ఉరేసి చంపేసేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఈ తతంగమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో సందీప్‌ తన భార్యపై కేసుపెట్టి వీడియో సీసీ కెమెరా పుటేజీని పోలీసులకు అందించాడు. ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా సంగీతను అరెస్టు చేశారు.

English summary

An Old Woman Killed In Uttar Pradesh By Her Daughter in law. This Video was uploaded in Youtube