శ్రీవారి హుండీ దగ్గర లక్ష రూపాయలు కాజేసిన మహిళ

An Unknown Women Theft One Lakh Near Tirumala Hundi

03:20 PM ON 25th April, 2016 By Mirchi Vilas

An Unknown  Women Theft One Lakh Near Tirumala Hundi

కలియుగ దైవం శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఓ గుర్తు తెలియని మహిళ స్వామి వారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడి బ్యాగు నుంచి రూ.లక్ష కాజేసింది. శ్రీవారి ఆలయం లోపల... శ్రీవారి హుండీకి అతి సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై తిరుమల విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ఓ భక్తుడు స్వామి వారి హుండీలో కానుక వేసేందుకు వెళ్లాడు. అయితే ఆ వ్యక్తిని ముందు నుండి గమనిస్తున్న ఆ మహిళ ఆ వ్యక్తి హుండీలో కానుక వేస్తుండగా, అతడి బ్యాగులో నుండి లక్ష నగదును అపహరించింది .ఇదంతా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది . దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

చిరు అబిమానులు కావాలంటున్న బాలయ్య

అనంత్‌ అంబాని స్పూర్తి తో బరువు తగ్గడం ఎలా ?

English summary

An Unknown woman in Trumala Tirupathi theft 1 lakh rupees from a Devote who came to Sri Venkateswara Swamy Temple. This theft was recorded in CC Camera and Police filed case on this incident and Searching for that Woman.