వ్యభిచారిగా మారిన శర్వానంద్ హీరోయిన్!

Anaika Soti turned as a prostitute

06:10 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Anaika Soti turned as a prostitute

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య 2, 365 డేస్ చిత్రంలో హీరోయిన్ గా నటించి మొదటి చిత్రంలోనే విపరీతంగా అందాలు ఆరబోసిన అనైక సోటి ఇప్పుడు వ్యభిచారిగా మారిపోయింది. అనైకా నటించిన రెండు చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో ఆ తరువాత మళ్ళీ ఈ అమ్మడు తెరపై కనిపించలేదు. కానీ ఇప్పుడు వ్యభిచారిగా దర్శనమివ్వబోతుంది. కంగారు పడకండి అనైక వ్యభిచారిగా కనిపించబోతుంది నిజ జీవితంలో కాదు.. రీల్ జీవితంలో.. ఆ వివరాల్లోకి వెళితే.. తమిళ డైరెక్టర్ బద్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'సెమ్మ బోత ఆగతా'. ఈ చిత్రంలో అధర్వ హీరోగా నటిస్తుండగా అనైక సోటి వ్యభిచారిగా నటిస్తుంది.

తొలుత ఈ పాత్ర కోసం చాల మంది హీరోయిన్లని సంప్రదించారు. అయితే ఈ పాత్ర మరీ బోల్డ్ గా ఉండడంతో వారందరూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తరువాత అనైక సోటిని సంప్రదించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వ్యభిచారి పాత్రలో అనైక చాలా అందంగా మరియు చాలా హాట్ గా కనిపిస్తుందని, ఇందులో ఈమె పాత్రే చాలా కీలకమని డైరెక్టర్ బద్రి తెలియజేశాడు. కిక్కాస్ ఎంటెర్టైన్మెంట్ బ్యానర్ పై హీరో అధర్వ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిష్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తుంది. యువన్ శంకర్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని, త్వరలోనే ఆడియోని ఆ పై సినిమాని విడుదల చేస్తామని చెప్పారు.

English summary

Anaika Soti turned as a prostitute