వైసిపిలోకి ఆనం సోదరుడు ....

Anam Vijaykumar Reddy To Join In Ysrcp

12:17 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Anam Vijaykumar Reddy To Join In Ysrcp

ఆనం కుటుంబంలో మరో ట్విస్ట్ . ఏం చేసినా వారికే చెల్లింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సోదరులు టిడిపి లో చేరిపోగా, వివేకాకు నెల్లూరు రూరల్‌ మండలంలో వెన్నెముకలా ఉంటున్న ఆయన సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డి వైసీపీ గూటికి రావడానికి నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు విజయకుమార్‌రెడ్డి నివాస ప్రాంతం చింతారెడ్డిపాలెం చేరుకుని మంతనాలు సాగించారు. విజయకుమార్‌రెడ్డి చేరిక దాదాపు లాంఛనమైనట్లుగా భేటీ అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు. విజయకుమార్‌ రాకను ఇప్పటికే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డిల దృష్టికి తీసుకెళ్లామని, వారు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రజల్లో పట్టున్న నేతలను చేర్చుకుంటున్నట్టు చెప్పారు. తాను వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఆనం విజయకుమార్‌రెడ్డి ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ఆహ్వానాన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ కార్యాకర్తలతో మరోసారి సంప్రదించి అధికారికంగా చేరేందుకు తుది గడువు త్వరలో ప్రకటిస్తానన్నారు. అనంతరం ఆనం విజయకుమార్‌రెడ్డితో కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు నెల్లూరు ఎంపీ మేకపాటి నివాసానికి వెళ్లి మంతనాలు సాగించారు. ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్‌, సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రూప్‌కుమార్‌ యాదవ్‌, బొబ్బల శ్రీనివా్‌సయాదవ్‌ తదితరులు విజయకుమార్‌ వెంట ఉన్నారు.

English summary

Recently Nellore district popular politicians Anam Brothers were joined in TDP by leaving Congress parrty and now Anam Vijaya kumar reddy was ready to join in YSRCP party. This was said by Anam Vijaya kumar reddy.