బాలయ్యతోనైనా  ఆ కోరిక తీరేనా?

Anam Vivekanand Reddy Cinema Entry

03:18 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Anam Vivekanand Reddy Cinema Entry

సినిమాల్లో ఉన్నోళ్ళు రాజకీయాలలోకి వస్తునట్టే, రాజకీయాల్లో ఉన్నోళ్ళు కూడా సినీ ప్రవేశం చేయడం సహజం. ఈ రెండు రంగాలకు అంతటి అవినాభావ సంబంధం వుంది. అందుకే రకరకాల ఫోజులతో, గెటప్‌లతో అలరించే, నెల్లూరు జిల్లా రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి సినిమాల్లో నటించాలని తెగ ఉబలాట పడిపోతుంటాడు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేక స్టైల్.

కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో వుండగా సినీ ప్రవేశం కోసం విశ్వప్రయత్నం చేసాడు. చిరంజీవి తన 150వ సినిమాలో వివేకాకు ఓ పాత్ర ఇస్తానని హామీ ఇచ్చాడట. కానీ, మారిన పరిస్థితుల నేపధ్యంలో అది అయ్యేట్లు లేదు. ఇక ఆ మధ్యలో నెల్లూరుకి చెందిన నిజాముద్దీన్ అనే ఓ నిర్మాత ఆనం వివేకాతో సినిమా తీయాలని భావించారు. అందుకు ఆయనని ఒప్పించారు కూడా. ఆ సినిమాలో వివేకాది న్యాయమూర్తి పాత్ర. తమిళ హీరోలు, ఓ ప్రముఖ హీరోయిన్ కాల్‌షీట్లు కూడా బుక్‌చేశారు. నెల్లూరులోని వి.ఆర్. బి.ఇ.డి కాలేజీ భవనంలో సెట్‌ వేశారు. ఆ సినిమాలో వివేకా పై ఓ సాంగ్‌ కూడా పెట్టాలనుకున్నారు.

ఆ పాటతోపాటు మరో నాలుగు పాటల రికార్డింగ్ పనులు కూడా పూర్తి చేసేసారట. ఆర్టిస్టులు కొందరికి రెమ్యునిరేషన్‌లో కొంతభాగం చెల్లించి, మరికొందరికి ఖరీదైన కానుకలు ముట్ట చెప్పారట. సినిమాకి "క్షమాపణ'' అన్న టైటిల్‌ ఖరారు చేసేసారట. అయితే వివేకాకు సినిమా టైటిల్ నచ్చక పక్కకు జరిగిపోయారట.

ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టిడిపి గూటికి చేరినా, సినిమా చాన్స్ ఊరిస్తోందట. పైగా ఆనం వివేకా ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరేముందు ముందు గెటప్ మార్చేశారు. సింహా చిత్రంలో బాలకృష్ణ స్టయిల్లో వొత్తు మీసకట్టుతో కనిపించారు. ఆనం కాంగ్రెస్‌ని వీడారు కాబట్టి చిరంజీవి 150వ సినిమాలో ఛాన్స్ ఉండకపోవచ్చునని గ్రహించి, బాలకృష్ణ గెటప్‌లోకి వచ్చేశారు అనే మాట వినిపిస్తోంది. బాలయ్య త్వరలో తీయబోయే వందవ సినిమాలో ఛాన్స్ కోసమే ఆనం వివేకా కొత్త గెటప్ వేస్తున్నారని అనుకుంటున్నారు. మరి ఇకనైనా ఆనం వివేకానంద రెడ్డి సినీ వేషం దక్కించుకుంటారో లేదో ....

English summary

Politician Nellore Ex-MLA Anam Vivekananda Reddy attracts people with his different styles.Previously chiranjeevi promised him that he will give chance in his 150 th film but Anam Vivekananda Reddy Changed Party by leaving congress and joined in TDP.Now he changed his get like Bala Krishna in Simha Movie and people were thinking that he was impressing balayya to get chance in bala krishna 100th movie