బంగారం లాంటి తండ్రి పేరు చెడగొట్టాడట జగన్

Anam Vivekananda Reddy Fires On Jagan

01:27 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Anam Vivekananda Reddy Fires On Jagan

జగన్ బంగారం లాంటి తండ్రి పేరు చెడగొట్టాడట

అవునా , అవునని అంటున్నారు ఆనం వివేకానందరెడ్డి. .... టిడిపిలోకి వెళ్ళడానికి ముహూర్తం నిర్ణయించుకున్న ఆనం రామనారాయణ రెడ్డి , వివేకానందరెడ్డి సోదరులు బుధవారం సప్తమి తిధి నాడు టిడిపి అధినేత , ఎపి సిఎమ్ చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాత ఇంటికే వచ్చామంటూ ఆనందంతో చెప్పిన ఆనం సోదరులకు చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. ఎపి టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆనం బ్రదర్స్ కి పార్టీ సాధారణ సభ్యత్వం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆనం వివేకా మీడియాతో మాట్లాడుతూ ' బంగారం లాంటి నాన్న పేరుని చెడ గొట్టిన ఘనత జగన్ దే' అని సెలవిచ్చారు. అంతే కాదండోయ్ అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకునని చెప్పుకునే అర్హత జగన్ కి లేదని కూడా అనేసారు. ఇక దీన్ని బట్టి భవిష్యత్తులో జగన్ పై దాడికి టిడిపి ఎలాంటి అస్త్రం తయారు చేసిందో వేరే చెప్పనవసరం లేదేమో.

టిడిపిలో చేరుతున్నందుకు వివేకా వివరణ ఇస్తూ ' రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. రాస్త్రాని అన్ని రకాలుగా అభివృద్ధి లోకి తీసుకు రావడానికి సిఎమ్ చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఇటువంటి సమయంలో అండగా నిలవాల్సిన అవసరం అందరికీ వుంది. అందుకే ఎలాంటి పదవులు ఆశించకుండా టిడిపిలో చేరుతున్నాం. తమతో పాటూ తమ అనుచరులంతా టిడిపిలోకి వచ్చేనట్టేనని ఆయన చెబుతూ వైస్సార్ సిపి వాళ్ళు కూడా టిడిపి లోకి వస్తారు. రంగు , రూపు అవసరాన్ని బట్టి మారడమే రాజకీయం ' అని అన్నారు.

ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఆపార్టీలో వున్న తాము దాదాపు 10-12ఏళ్ళు కల్సి పనిచేశామని , మళ్ళీ కల్సి పనిచేస్తామని చెప్పారు. ఇన్నాళ్ళూ టిడిపిని విమర్శించి ఇప్పుడు ఎలా చేరారని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, 'నిజమే. ఒకసారి కాదు చాలాసార్లు విమర్శించిన సందర్భాలున్నాయి . అయితే సిద్ధాంతాల ప్రాతిపదికనే తప్ప వ్యక్తిగతంగా కాదు. అయినా రాష్ట్రాభివృద్ధి కోసం అంతా కల్సి పనిచేయాల్సిన సమయం ఇది. సాధారణ కార్యకర్తల్లా పార్టీలో చేరాం. ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తాం' అని వివరించారు.

English summary

Ex-Congress party leader Anam Vivekananda reddy and his brother anam rama narayana reddy joins in telugu desam party(TDP) todsay. He says that Jagan Mohan Reddy who was son of ex-cheif minister of andhra pradesh y.raja sekhara reddy has damaging his fathers image