టూ పీస్ బికినీలో నటించమని వేధించారట!

Anandi harassed from directors

01:47 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Anandi harassed from directors

ఆట ప్రోగ్రాంలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసిన ఆనంది ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ తో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో.. కోలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. అక్కడ ఈమెకు ఆఫర్లకు కొదవలేదు. ఆనంది నటించిన ఇనక్కు ఇన్నోరు పర్ ఇరుక్కు మూవీ ఈనెల 17న రిలీజ్ కు సిద్ధమవుతోంది. సినిమాల గురించి చెబుతూనే.. గ్లామర్ ఇండస్ర్టీలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంది. కొన్ని చిత్రాల్లో అరకొర దుస్తులు ధరించి అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారని, ఆ టైమ్ లో చాలా అసౌకర్యానికి గురయ్యానని తెలిపింది.

కొన్ని సందర్భాల్లో నటించేదిలేదని, కాదంటే షూటింగ్ నుంచి వెళ్లిపోతానని బెధిరించానని చెప్పుకొచ్చింది ఆనంది. గ్లామరస్ డ్రెస్ లు తనకు అంతగా సెట్ కావని, అలాంటివాటికి దూరంగా వుండాలని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఇదే విషయాన్ని మూవీ ఓకే చేసేముందు ఇటు డైరెక్టర్.. అటు ప్రొడ్యూసర్లకు తెలియజేస్తానని అంటోంది. తన లేటెస్ట్ మూవీ ఇనక్కు ఇన్నోరు పర్ ఇరుక్కులో మంచి రోల్ చేస్తున్నానని, ఇందులో దాదా కూతురిగా కనిపిస్తానంటోంది ఆనంది.

English summary

Anandi harassed from directors