త్రివిక్రమ్‌ కి నో చెప్పిన హీరోయిన్‌

Ananya says no to Trivikram

05:04 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Ananya says no to Trivikram

మాటల మాంత్రికుడిగా తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. తను రాసే ప్రతీ డైలాగ్‌ లోనూ కొండంత అర్ధముంటుంది అంటే అది అతిశయోక్తి కాదు. 'స్వయంవరం' చిత్రంతో మొదలు పెట్టిన తన సినీ ప్రస్థానం s/o. సత్యమూర్తి వరకు దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. తన చిత్రాల్లో ఎటువంటి అసభ్యతా లేకుండా ఇటు క్లాస్‌ని అటు మాస్‌ని కట్టి పడేశేలా తెరకెక్కించడం త్రివిక్రమ్‌ శైలి. అందుకే ప్రతీ హీరో, హీరోయిన్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించడానికి ఇష్టపడతారు. అయితే త్రివిక్రమ్‌ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం అ..ఆ... నితిన్‌-సమంత మొదటిసారి జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా ఘాటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ అవసరమయ్యి త్రివిక్రమ్‌ అనన్యని సంప్రదించారట. 'జర్నీ' చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య త్రివిక్రమ్‌ చిత్రంలో నటించడానికి నో చెప్పిందట. దానికి కారణం లేకపోలేదు ఈ చిత్రంలో అనన్య నితిన్‌ కి చెల్లెలుగా నటించాలట. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిన అనన్య ఇలా చెల్లెలు పాత్రలో కనిపిస్తే తన కెరీర్‌ ప్రాబ్లమ్‌ అవుతుందని అభ్యంతరం చెప్పిందట. అయితే త్రివిక్రమ్‌ ఈ చిత్రం కథ పూర్తిగా వినిపించాక కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందట.

English summary

Journey fame Ananya says no to Trivikram latest movie A Aa. In this movie Nithin and Samantha is pairing first time.