నితిన్‌ చెల్లెలిగా తమిళ హీరోయిన్‌

Ananya To Be Acts As Sister To Nithin

03:16 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Ananya To Be Acts As Sister To Nithin

నితిన్‌, సమంత హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అఆ' చిత్రం లో నితిన్‌ చెల్లెలి పాత్రలో నటించేందుకు తమిళ హీరోయిన్‌ అనన్యను ఎంపిక చేశారు. తెలుగు,తమిళ ,మళయాళ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలను పోషించిన తమిళ కుట్టి అనన్య తెలుగు ప్రేక్షకులకు జర్ని సినిమా ద్వారా పరిచయమైంది . జర్నీ సినిమా తెలుగులో మంచి విజయం సాధించడంతో తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య ఆ తరవాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఇంటింటా అన్నమయ్య చిత్రంలో హీరోయిన్‌ గా చేసింది . అయితే ఈ చిత్రం వివిధ కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు . ఆ మధ్య హీరో కృష్ణుడు నటించిన అమాయకుడు చిత్రంలో నటించిన అనన్యకు గుర్తింపు రాలేదు. ఇప్పుడు త్రివిక్రమ్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌ చిత్రంలొ హీరో చెల్లెలి పాత్రకు ఒప్పుకున్న అనన్యకు ఈ చిత్రంతో నైనా మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం.

English summary

Tamil Actress Ananya to act as sister to nithin in nithins new movie "Aa Aaa" which was ditecting by one of the top director in tollywood trivikram srinivas