తన లవ్ స్టోరీ గుట్టు విప్పిన అనసూయ

Anasuya about her love marriage

11:01 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Anasuya about her love marriage

జ‌బర్ద‌స్త్ లో హాట్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న అన‌సూయ ఇప్పుడు రూమర్ల పై చాలా కూల్‌గా ఉంటోంది. పబ్లిక్ ఫిగర్ గా ఉన్నపుడు ఇలాంటివి తప్పవని జ్ఞానోదయం అయిందని అంటోంది. అయితే మ‌నం ఏం చేసినా తప్పు పట్టే వాళ్ళు ఉంటారని.. అందుకే ఇలాంటి రియాక్షన్ల పై పొదుపుగా రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అయిందట. అనేక కార్య‌క్ర‌మాల‌కు యాంక‌రింగ్ చేస్తూ.. దూసుకు పోవడమే కాక, న్యూస్ ప్రెజెంటర్ నుంచి యాంకర్, యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన అనసూయ.. ప్రస్తుతం సినిమా కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసింది. చాలా ఆఫర్స్ వదులుకుని.. చేసిన రెండు సినిమాలు సక్సెస్ సాధించడంతో అన‌సూయ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంది.

హాట్ యాంకర్ గా ఉన్నప్పటి నుంచి సినిమాల వరకూ అనసూయ పై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అయితే.. ఇలాంటి వాటి పై మొదట చాలా ఫీలయిపోయినా, ఆ తరువాత వాటికి ఆన్సర్ ఇచ్చేసింది. ఇక్కడ ఓ విషయం వుంది. ఏమంటే అనసూయ రియల్ లైఫ్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఎన్సీసీ కేడెట్ గా ఉన్నపుడు ఆమెతో పాటు ఆమె భ‌ర్త ఇద్దరూ ఒకే క్యాంప్ లో ఉండేవారట. త‌న భ‌ర్త త‌న‌కు ప్లస్ టూ చదువుతున్నపుడు ప్రపోజ్ చేయగా… నాలుగేళ్ల తర్వాత ఓకే చెప్పిందట. అయితే ఇంట్లో సంబంధాలు వెతకడం చూశాక.. అప్పుడు తండ్రికి ఈ విషయం చెప్పడం అయిందట.

ఆ విధంగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఐదేళ్ల సమయం పట్టిందట. అలా చివరకు 2010 లో పెళ్లిచేసుకున్నామని అనసూయ అంటోంది. తాము 9 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ల‌వ్ చేసుకున్నామ‌ని అన‌సూయ తెలిపింది. భర్త అందించే సహకారంతోనే తను కెరీర్ లో ఈ స్థాయికి చేరుకున్నానని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని సంబర పడుతూ చెబుతోంది.

English summary

Anasuya about her love marriage. Hot anchor Anasuya revealed about her love marriage.