అనసూయ రేటు ఇప్పుడెంతో తెలుసా?

Anasuya demanding 50 lakhs for movie

04:26 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Anasuya demanding 50 lakhs for movie

సోగ్గాడే చిన్ని నయానా, క్షణం చిత్రాలతో ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయకి... అమాంతం ఒకేసారి క్రేజ్ వచ్చి పడింది. ఆ క్రేజ్ ఎన్నాళ్ళు వుంటుందో అని పసిగట్టిందో ఏమో కానీ క్రేజ్ ఉన్నప్పుడే ఆ క్రేజ్ ని కాసులుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. బుల్లితెర పై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ గా మారిన అనసూయ... వెండితెర పై కూడా పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేస్తోంది. తనకి 50 లక్షల రూపాయలు ఇవ్వగలిగే వారు మాత్రమే కథ చెప్పేందుకు రావాలని అన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్. రాశీఖన్నాలాంటి హీరోయిన్లే... 25 లక్షలకి నటిస్తుంటే, అనసూయ అంత డిమాండ్ చేయడం పై విమర్శలు వచ్చాయి.

ఆ విమర్శలకి కూడా సమాధానం ఇచ్చింది అనసూయ. తాను బుల్లితెర పై ఒక్క ఎసిపోడ్కి లక్ష రూపాయలు తీసుకుంటుంటే... సినిమా చేసేందుకు 50 లక్షలు తీసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించింది. అలాగే తన ఫేస్ బుక్ ఎకౌంట్ కు ఉన్న క్రేజ్ ని చూస్తే... 50 లక్షలు ఇవ్వవచ్చని సోది చెప్పుకొచ్చింది.

English summary

Anasuya demanding 50 lakhs for movie