అనసూయ ఏడ్చేసింది ... ఎందుకో తెలుసా ?

Anasuya Gets Emotional And Cries On Stage

11:26 AM ON 22nd December, 2016 By Mirchi Vilas

Anasuya Gets Emotional And Cries On Stage

అనసూయ అనగానే యాంకర్ గుర్తొస్తుంది. ఓ ప్రముఖ చానెల్ లో వచ్చే కామెడీ షోలో తన యాంకరింగ్ తో కట్టిపడేసే అనసూయ, సరదాకు మారుపేరు అయింది. అయితే ఇంత సరదాగా వుండే అనసూయ వెక్కివెక్కి ఏడ్చేసింది. ఇంతకీ ఎందుకంటే, బుల్లితెరలో ప్రముఖ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అయిన పచ్చా మధు తీవ్ర అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందిన మధు.. ఈ నెల 8న మరణించడంతో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో అనసూయ కన్నీటి పర్యంతమైంది. మధు తనను ఎంతగా ప్రోత్సహించిందీ, కెరీర్ లో ఎంతగా ఊతమిచ్చిందీ గుర్తుచేసుకున్న అనసూయ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరుమున్నీరై, విలపించింది. సభ మొదలు పెట్టిన దగ్గర్నుంచి.. మాట్లాడే దాకా అనసూయ దు:ఖంతోనే ఉంది. కామెడీ షో టీమ్ తో మధుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, అందరినీ ఎంతో ప్రోత్సహించేవారని, ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని ఆమె దు:ఖ స్వరంతో చెప్పింది. అదండీ సంగతి.

ఇది కూడా చూడండి: ఆ సందర్భాల్లో తేనె వాడితే ….. చాలా ప్రమాదం

ఇది కూడా చూడండి: దారుణం:15వ అంతస్తు నుంచి 5 ఏళ్ల బాలికను విసిరేసింది

ఇది కూడా చూడండి: ఫేస్ బుక్ ప్రియులకు ఇక పండగే

English summary

Anasuya Gets Emotional And Cries On Stage.