ఐటమ్‌ సాంగ్‌కి ఓకే చెప్పి అది కూడా కావాలంటుంది

Anasuya Green Signal To Item Songs

04:23 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Anasuya Green Signal To Item Songs

హాట్‌ యాంకర్‌ అనసూయ బుల్లితెర పై నుండి వెండితెర పైకి వచ్చింది. బుల్లితెర పై హాట్‌హాట్‌గా కనిపించిన అనసూయని కోరి మరీ వెండితెర పైకి తెచ్చుకున్నారు. అనసూయ నటించిన మొదటి చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. పేరుకి స్టార్‌ హీరో సినిమా అయినా అనసూయ కనిపించింది ఇందులో 5 నిముషాలు మాత్రమే. అంతేకాదు ఇందులో ఈ అమ్మడు పెద్దగా హాట్‌గా కూడా కనిపించలేదు. దీనితో ఈ హాట్‌ యాంకర్‌ కి పెద్ద గుర్తింపు రాలేదు. అనసూయ ఇటీవల నటించిన 'క్షణం' చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్ర కావడంతో ఈ యాంకర్‌ కి అందాలు ఆరబోసే అవకాశం రాలేదు. సినిమా హిట్‌ అయినా అనసూయ కెరీర్‌ కి ఇది పెద్దగా ఉపయోగపడదు. అయితే ఇప్పుడు అనసూయకి పోటీగా మరో హాట్‌ యాంకర్‌ రష్మీ ఇప్పుడు రంగంలోకి దిగింది. అనసూయలా కాకుండా పూర్తి నిడివివున్న పాత్రలో రష్మీ 'గుంటూర్‌ టాకీస్‌' చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి సంబందించిన రెండు టీజర్‌ సాంగ్స్‌ని విడుదల చేశారు. ఇందులో రష్మీ రెచ్చిపోయి మరి అందాలు పరిచింది.

ఈ వీడియో చూసిన జనం పిచ్చెక్కిపోయారు. అసలు ఇందులో ఉంది రష్మీనేనా అని ఆశ్చర్యపోయారంతా. తన అందాలతో కుర్రకారుని మొత్తం ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకుంది. గత రెండు వారాల నుండి సినీ పరిశ్రమలో రష్మీ గురించే చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం విడుదలైతే రష్మీకి మంచి బ్రేక్‌ వస్తుందని అనుకుంటున్నారంతా. దీనితో అనసూయ పనైపోతాది అని అనుకున్నారంతా. ఈ విషయం గ్రహించిన అనసూయ వెంటనే అందాలు ఆరబోయందే ఈ ఇండస్ట్రీలో గెలవలేం అని నిర్ణయించుకుంది. అందుకే తాజాగా ఒక ఐటమ్‌ సాంగ్‌ చెయ్యడానికి అంగీకరించింది అంతేకాదు ఆ చిత్రంలో ఐటమ్‌సాంగ్‌తో పాటు సినిమాలో చిన్న పాత్రకూడా ఇవ్వాలంటూ కండీషన్‌ పెట్టిందట. దీనితో ప్రేక్షకులకి దగ్గరవ్వాలన్నది అమ్మడి ప్లాన్‌. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

అనసూయ హాట్ ఫోటోలు మీ కోసం

1/7 Pages

సోగ్గాడే చిన్నినాయిన ఆడియో ఫంక్షన్

English summary

Jabardasth Fame Anasuya was known for her beauty in Tv.And recently she acted in Soggade Chinni Nayana and kshnama movie .Now she accepted to do Item song in a movie.