అనసూయ ఉన్నా లేనట్టే..

Anasuya role is not good in Soggade Chinni Nayana

04:36 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Anasuya role is not good in Soggade Chinni Nayana

తెలుగులో హాట్ యాంకర్‌గా అనసూయకు మంచి పేరు ఉంది. కొన్ని అవార్డు ఫంక్షన్లలో కురచ దుస్తుల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ సినిమా వాళ్ళ దృష్టిని ఆకట్టుకుంది. చాలా ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానని అనసూయ చెప్పడంతో వచ్చిన ఆఫర్లన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. చివరికి 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో చెయ్యడానికి ఒప్పుకుంది. ఈ సినిమా ద్వారా అనసూయ చాలా పాపులర్‌ అవుతుందని అందరూ అనుకున్నారు. తను కూడా ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ అని అనసూయ తెగ మురిసిపోయింది. తీరా చూసేసరికి ఈ సినిమాలో ఒక పాటలో చిన్న బిట్‌లో మాత్రమే అనసూయ కనబడింది.

ఆ కొద్దిసేపు కూడా అనసూయ అంత గ్లామర్‌గా కనిపించలేదు. సినిమా చూసిన వాళ్ళల్లో చాలా మందికి అనసూయ ఉందన్న విషయం కూడా తెలియలేదు. ఇక అనసూయకు అవకాశాలు వస్తాయో లేదో మరి.

English summary

Anasuya role is not good in Soggade Chinni Nayana movie. Her role in this movie is very small. And also she appear in the movie upto 2 minutes.