సంపుర్ణేష్ ని బూతులు తిడితే.. అనసూయ సపోర్ట్...

Anasuya supports burning star Sampoornesh Babu

11:09 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Anasuya supports burning star Sampoornesh Babu

తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ ఈమధ్య కాలంలో అభిమానులను కడుపుబ్బా నవ్విస్తున్న బర్నింగ్ స్టార్ అదేనండి మన సంపూర్నేష్ బాబు, ఇప్పుడు సంపూను బూతులు తిట్టారట.. ఇంతకీ ఎవరు ఎందుకంటే వివరాల్లోకి వెళ్ళాలి. ఎన్ఆర్ఐల ఆర్గనైజేషలలో ఒకటైన ఆట(ఏటిఏ) ఆర్గనైజర్ రాజ చెన్నుపాటి తనను బూతులు తిట్టారని ట్విట్టర్ లో తనగోడును సంపూర్నేష్ వాపోయాడు. అయితే సంపూకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని తెల్సింది. కానీ సంపూని వెనకేసుకు వస్తూ, మద్దతుగా అనసూయ కూడా ట్వీట్ చేసింది. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఒక కళాకారుడితో నడుచుకోవడం కూడా రాకపోతే ఎలా? సంపూ చెప్పినదాని ప్రకారం తల్లిదండ్రులను కూడా దూషించినట్లు సంపూ పేర్కొన్నాడు.

కళాకారులు అంటే అడుక్కోనేవారు కాదు కాస్త గౌరవం ఇవ్వండి అంటూ సంపూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అలా అంటూనే నాకు ఆట పై గౌరవఅభిమానాలు ఉన్నాయి వచ్చే ఏడాది కలుద్దాం. ఈసారికి మా టీం సభ్యులు ఎవరు ఆటకు హాజారు కారు అని ట్విట్టర్ లో తేల్చాడు. ట్విట్టర్ లో సైలెంట్ గా ఉండే యాంకర్ అనసూయ దీని పై స్పందించడం చూస్తుంటే, విషయం తీవ్రత అర్ధం అవుతుంది. కళాకారులే కాదు తోటి మనిషి పై కనీస గౌరావం ఉండాలి కదా అనే కామెంట్స్ వినబడుతున్నాయి.

English summary

Anasuya supports burning star Sampoornesh Babu