వామ్మో అనసూయ అలా పెంచేసిందేంటి!

Anchor Anasuya increased her remuneration

03:22 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Anchor Anasuya increased her remuneration

'జబర్దస్త్' కామెడీ షోలో హాట్ హాట్ గా యాంకరింగ్ చేసి బుల్లి తెరతో ప్రేక్షకులని సంపాదించుకుని, ఆ తరువాత మా టీవీలో ప్రసారమయ్యే 'మోడరన్ మహాలక్ష్మీ' లో కూడా హాట్ హాట్ గా దర్శనమిచ్చిన అనసూయ ఆ తరువాత సినిమాల్లో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం లో నాగార్జున కి మరదలిగా నటించి తన అందంతో యువతను అలరించిన ఈ హాట్ యాంకర్ ఇటివలే 'క్షణం' లో నెగటివ్ రోల్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. 'క్షణం' సూపర్ హిట్ కావడంతో ఆ క్షణంలోనే తన రెమ్యునరేషన్ పెంచేసిందట. అనసూయ 'క్షణం' సినిమాకు దాదాపు 20 లక్షలు పారితోషకం తీసుకుందని టాక్.

ఇక కొన్ని పాత్రలతో అనసూయను కలుస్తున్న దర్శక నిర్మాతలకు అనసూయ తన రెమ్యునరేషన్ తో చుక్కలు చూపిస్తుందని సమాచారం. తాజాగా ఒక చిత్రానికి ఈ అమ్మడు 40 లక్షలు అడిగిందని ఫిలిం నగర్ లో టాక్. ఒక పక్క తనకు పేరు తెచ్చి పెట్టిన జబర్దస్త్ ప్రోగ్రాంలో కనిపిస్తూనే వెండి తెర పై కూడా దృష్టి పెట్టింది హాట్ యాంకర్. ఏదేమైనా ఈ అమ్మడు కనిపించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకోవడమే తన రెమ్యునరేషన్ పెంచడానికి కారణమని నవ్వుతూ చెబుతుందట. సినిమా కెరీర్ ప్రారంభంలోనే ఇలా డిమాండ్ చేస్తున్న ఈ ఆంటీని చూసి అనసూయకి అంత సీన్ ఉందా అని అనుకుంటున్నాయి సినీ వర్గాలు.

ఇంకొందరైతే ఈ ఆంటీకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారట.. మరి కొందరు చిన్న నిర్మాతలు మాత్రం అనసూయ దగ్గరికి వెళ్ళాలంటే బయపడుతున్నారట.

English summary

Anchor Anasuya increased her remuneration. Hot anchor Anasuya increased her remuneration.