యాంకర్ నిరోషా ఆత్మహత్యలో ఊహించని ట్విస్ట్!

Anchor Nirosha get suicide for severe stomach pain

05:39 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Anchor Nirosha get suicide for severe stomach pain

ప్రొద్దున్న యాంకర్ నిరోషా ఆత్మహత్యకి ప్రేమే కారణమని వచ్చిన వార్తలకి చెక్ పెడుతూ తాజాగా మరో ట్విస్ట్ వచ్చి ఈ ఆత్మహత్యలో చేరింది. అసలు విషయంలోకి వస్తే చిత్తూరుకు చెందిన నిరోషా కొద్ది సంవత్సరాల కిందట హైదరాబాద్ వచ్చి యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. కొన్ని న్యూస్ ఛానెల్స్‌లో పనిచేసిన నిరోషా ఇప్పుడు జెమినీ మ్యూజిక్‌లో యాంకర్‌గా పని చేస్తుంది. అయితే నిరోషా సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో తన స్నేహితురాలితో ఉంటుంది. ఇదిలా ఉంటే నిరోషాకు కెనడాలో ఉద్యోగం చేస్తున్న రిత్విక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. ఇటీవలే వీరద్దరి నిశ్చితార్ధం కూడా జరిగింది.

టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

తారలు..వారి భార్యలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

వచ్చే నెలలో వీరిద్దరికి పెళ్లి జరిగే తరుణంలో ఈలోపే ఆత్మహత్య చేసుకుంది. ఏమయిందో కానీ మంగళవారం రాత్రి కాబోయే భర్త రిత్విక్‌కు వీడియో కాల్ చేసింది. తను చనిపోతున్నట్టు సమాచారం అందించి నిరోషా ఫోన్ పెట్టేసిందట. దీంతో షాక్ అయిన రిత్విక్ వెంటనే నిరోషా కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిరోషా తీవ్రమైన కడుపునొప్పితో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.

English summary

Anchor Nirosha get suicide for severe stomach pain in Secundrabad.