ఫుల్లుగా తాగి యువతి పై రెచ్చిపోయిన ప్రదీప్ & ఫ్రెండ్స్

Anchor Pradeep and friends misbehave with girl

12:47 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Anchor Pradeep and friends misbehave with girl

సాధారణ వ్యక్తులు కంటే సెలెబ్రిటీలు బయటకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఏం చేసినా తరువాత రోజు వార్తల్లో నిలుస్తారు. ఒకవేళ వారు ఏ మాత్రం పబ్లిక్ లో మితిమీరి ప్రవర్తించినా ఆ ఇంపాక్ట్ పబ్లిక్ మీద చాలా స్పీడ్గా ఉంటుంది. అందువల్లే వారు బయటకు వచ్చినప్పుడు తమ స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలి. ఇటీవల టాలీవుడ్ కు చెందిన కొందరు హీరోలు బయటకు వచ్చినప్పుడు తప్పతాగి తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగులో బుల్లితెర మీద పలు పాపులర్ ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ అండ్ ఫ్రెండ్స్ వచ్చి చేరారు.

ఆ వివరాల్లోకి వెళితే.. ప్రదీప్ తన ఫ్రెండ్స్ తో కలిసి సోమవారం రాత్రి హైదరాబాద్ లోని ఫ్రీ ప్లో ట్రాఫిక్ బార్ కు వచ్చారు. బార్ లో ప్రదీప్ అండ్ గ్యాంగ్ అక్కడ తప్పతాగినట్టు తెలుస్తోంది. రాత్రి 11.30 సమయంలో బయటకు వెళుతూ ప్రదీప్ ఫ్రెండ్ ఒకరు యువతిపై కామెంట్లు చేశారు. దీంతో ఆ అమ్మాయితో వచ్చిన స్నేహితులు అదేంటని ప్రశ్నించగా ఇరు వర్గాల మధ్య చిన్నపాటి కొట్లాటే జరిగిందని సమాచారం. ఇక ఈ దాడి జరుగుతున్న టైంలో పక్కనే ఉన్న ప్రదీప్ ఏమీ పట్టనట్లు వెళ్ళిపోయాడట. దీంతో పక్కనే ఉన్న వారు సైతం ప్రదీప్ అండ్ గ్యాంగ్ తీరును తప్పుపట్టారు. బార్ బౌన్సర్స్ అడ్డుపడి ఇరు వర్గాలవారిని అక్కడినుండి పంపేశారని సమాచారం.

English summary

Anchor Pradeep and friends misbehave with girl