తమిళ్ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్ లో హీరో గా యాంకర్ ప్రదీప్

Anchor Pradeep is giving entry as a hero

11:07 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Anchor Pradeep is giving entry as a hero

ఇప్పుడు బుల్లి తెరవాళ్ళు సినిమాల్లో కూడా దంచేస్తున్నారు. చిన్న రోల్స్ దగ్గర నుంచి హీరోహీరోయిన్ల వరకూ చాలామంది బుల్లితెర వాళ్ళు చేసేస్తున్నారు. ఇక యాంకరింగ్ తో టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రదీప్ ఇప్పడు సిల్వర్ స్క్రీన్ మీద తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. 'గడసరి అత్త - సొగసరి కోడలు', 'ప్రదీప్ దర్బార్', 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' వంటి టీవీ షోలతో ఇంటిల్లపాదికి తనదైన ముద్ర వేశాడు ప్రదీప్. తమిళంలో సూపర్ హిట్ అయిన ముందాసుపట్టి తెలుగు రీమేక్ లో ప్రదీప్ లీడ్ రోల్ కోసం AM ప్రొడెక్షన్స్ వారు సంప్రదింపులు జరుపుతున్నారు. . 1980లో జరిగిన కథాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది.

సెటైరికల్ కామెడీగా ఉండబోతోన్న ఈ సినిమాలో మొదట సుధీర్ బాబుని అనుకున్నప్పటికీ, కుదరకపోవడంతో సీన్ లోకి ప్రదీప్ ఎంటర్ అయ్యాడు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కావచ్చని అంటున్నారు.

English summary

Anchor Pradeep is giving entry as a hero with Mundasupatti Telugu Remake