మహిషాసుర మర్దిని అవతారాన్ని సెక్స్ వర్కర్ తో పోల్చిన టీవీ యాంకర్

Anchor Sindhu SooryaKumar Gets 2000 Threat Calls

05:11 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Anchor Sindhu SooryaKumar Gets 2000 Threat Calls

ప్రజలు చాలా తెలివి మీరిక్పోయారు ... మరోపక్క సహనం కూడా చూపించే పరిస్థితి వుండడం లేదు ... అందుకే వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరినీ వాయించి వదిలిపెడుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా ఏషియా నెట్ ఛీప్ కో ఆర్డినేటింగ్ ఎడిటర్ కం ఏంకర్ సింధు సూర్యకుమార్ కూడా ఇలాంటి చిక్కుల్లో పడిందని అంటున్నారు. రీసెంట్ గా ఈమెకు రెండువేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చి షాక్ ఇచ్చాయి. అందులో ప్రతీది బూతులు తిడుతున్న కాల్ కావడంతో ఈమె ఆ తిట్ల నుంచి కోలుకోలేదు. ఎంతో పేరున్న సింధుకి ఇలాంటి కాల్స్ రావటం వెనుక పెద్ద తతంగమే నడిచిందట. వివరాల్లోకి వెళితే, రీసెంట్ గా ఆమె ... తను పనిచేస్తున్న ఏషియానెట్ ఛానెల్ లో ...మహిషాసుర జయంతి జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించింది. దాంతో ఇది నచ్చని చాలా మంది ఆమెపై మండిపడ్డారు. టీవీ యాంకర్‌ను తిడుతూ ఏకంగా 2వేలకు పైగా ఫోన్ కాల్స్ చేసారు. ఫిబ్రవరి 26న ఈ షో నిర్వహిస్తే, ఇక అప్పటి నుంచి ఆమెను తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఆ షో జరుగుతున్న సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని సింధుపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా జనం రెచ్చిపోయారు. ఆమె ఫేస్‌బుక్ పేజీలో తీవ్రవ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబరు కూడా పోస్ట్ చేసి, ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని చెప్పటమే ఆమెకు తిడుతూ ఫోన్ కాల్స్ రావటానికి కారణమైంది.

ఆ కాల్స్ తో విసిగెత్తిపోయిన సింధు ఇక తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంక్వైరీ చేసి, ఆమెకు ఫోన్లు చేసిన ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్లంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామ సేన లాంటి సంస్థలకు చెందినవారని తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ అంటున్నారు. అయితే.. తాను దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత వీవీ రాజేష్ ఓ కరపత్రంలో చదివారని, దాన్ని దేశద్రోహం అని ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. హిందూదేవతను సెక్స్‌వర్కర్‌గా చెప్పడంలో తప్పేంటని తాను అనలేదని సింధు పేర్కొంటూ, అనలేని మాటలను అన్నట్టుగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించింది. 'ఇటీవల కాలంలో కావాలని కొందరు, తట్టుకోలేక కొందరు, తెలీకుండా మరికొందరు అనవసర వివాదాల్లో దూరిపొతున్నారు. పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు.' అంటూ కొందరు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

English summary

Sindhu Sooryakumar, chief coordinating editor of Asianet News TV.She had received almost 2000 phone calls for making abusing words against Godesses Durga.During the Show she called Durga a sex worker. Due to this soo many people were fired against Sooryakumari in facebook and one of the person have posted her phone number .Soo many callers were called her and fired on her that they will kill her.She complained to police on this incident and police arrested 5 Members.