అనసూయ, రేష్మీలను మించిపోయిన మరో హాట్ యాంకర్

Anchor Srimukhi dominating Anasuya and Rashmi

03:57 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Anchor Srimukhi dominating Anasuya and Rashmi

'జబర్దస్త్' కామెడీ షోతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు అనసూయ, రేష్మీ. ఈ షో కోసం కేవలం వీళ్ళు ఆరబోసిన అందాలకే వీరికి ఎనలేని క్రేజ్ని తెచ్చిపెట్టాయి. దీంతో.. వీరికి మూవీ ఆఫర్స్ కూడా వచ్చి పడ్డాయి. రేష్మీ విపరీతంగా అందాలు ఆరబోస్తూ వెండితెరపై మెరుస్తుంటే.. అనసూయ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ ఊపు ఊపుతుంది. ఓవైపు టీవీ షోస్, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న వీరికి పోటీ ఎవరూ రారని అంతా అనుకున్నారు. కానీ.. ఇప్పుడు మరో హాట్ బ్యూటీ వీరిని డామినేట్ చేస్తూ తెరపైకి వచ్చింది. ఆమె మరెవ్వరో కాదు.. శ్రీముఖి. అదుర్స్ అనే షో ద్వారా యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మడు.. 'ప్రేమ ఇష్క్ కాదల్' అనే చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ మూవీ మంచి విజయం సాధించింది కానీ.. శ్రీముఖికి కథానాయికగా నటించే అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో.. ఆమెకు వచ్చిన చిన్నచిన్న పాత్రలు చేస్తూ యాంకర్ గా కొనసాగుతూ వచ్చింది. అప్పట్లో ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. ఇప్పుడు ఈమెకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇప్పటికే పటాస్ వంటి కామెడీ షోలలో నటిస్తూ టివిలో ఇరగదీస్తున్న ఈ అమ్మడికి.. వరుసగా చిన్న చిన్న క్రూషియల్ రోల్స్ వరిస్తున్నాయి. ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటికీ సరైన న్యాయం చేసిన ఈ అమ్మడు.. మరిన్ని ఆఫర్స్ అందుపుచ్చుకుంటుంది. ఇండస్ట్రీలో ఎలాలంటే అందాల ఆరబోత కూడా ఉండాలని గ్రహించిన శ్రీముఖి ఈమధ్య ఎక్స్పోజింగ్ డోస్ ని కూడా బాగా పెంచేయడంతో యూత్ లో ఈమెకు ఫాలోయింగ్ బాగానే పెరిగింది.

నిన్నటివరకు అనసూయ, రేష్మీ అంటూ జపం చేసేవారు ఇప్పుడు శ్రీముఖి అని జపం చేస్తున్నారు. ఇలాగే కొంతకాలం వరుసగా ఆఫర్లు అందుకుంటూ.. అందాలు ఆరబోస్తుంటే ఆ ఇద్దరి క్రేజ్ తగ్గిపోతుందని చెప్పుకుంటున్నారు.

English summary

Anchor Srimukhi dominating Anasuya and Rashmi