యాంకర్ సుమ కొత్త అవతారం

Anchor Suma sung a song for Sell me the answer program

10:55 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Anchor Suma sung a song for Sell me the answer program

అది ఇదీ అని లేదు, ఏ టీవీలో చూసినా, ఏ ఫంక్షన్ చూసినా యాంకర్ సుమ కనిపిస్తూ సందడి చేస్తుంది. ఇంట్లోని చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకూ సుపరిచితమైన ఆబాల గోపాలాన్ని అలరిస్తోంది. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా సుమకు ఫాన్ అయిపోయారు. ఇక సుమ టీవీ షో చూడని తెలుగువాళ్లు దాదాపు ఉండరనే చెప్పాలి. అంతగా నేరుగా నట్టింట్లోకి వచ్చేసిన సుమ టీవీ యాంకర్ గానూ, ఆడియో ఫంక్షన్స్ లోను, తన మల్టీటాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అంతటితో ఆగని సుమ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తింది. సింగర్ గా టర్న్ తీసుకుంది.

మాటీవీ రూపొందిస్తున్న సెల్ మీ ద ఆన్సర్ అనే న్యూ గేమ్ షో కోసం ఈ కేరళ కుట్టి సుమ పాట పాడింది. రవికాంత్ రాసిన పాటను సుమ పాడగా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె నేతృత్వంలో రికార్డింగ్ చేసారు. ఈ విషయాన్ని స్వయంగా రఘు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక గాయనిగా ఎలాంటి సంచలనాలు చేస్తుందో చూడాలి మరి.

English summary

Anchor Suma sung a song for Sell me the answer program