పాపం సుమకు ఏమైంది?

Anchor Suma was suffering from throat disease

09:54 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Anchor Suma was suffering from throat disease

అలవోకగా డైలాగులు చెబుతూ, యాంకరింగ్ అంటే ఇలా వుండాలని అందరి చేతా శెహబాష్ అన్పించుకుంటున్న యాంకర్ సుమ ఇప్పుడు ఏ ఇబ్బందుల్లో పడింది? మలయాళీ అమ్మాయి అయినా ఒక్క మాట కూడా తూలకుండా అచ్చం తెలుగు అమ్మాయిలా మాట్లాడుతూ ఎందరో మనసులను దోచుకుంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలు కూడా సుమ యాంకరింగ్ అంటే పిచ్చ అభిమాని. మొత్తం మీద ఇరవై మూడేళ్ల కెరీర్‌ లో ఎన్నో వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ చేస్తూ హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సుమ సొంతం చేసుకుంది.

అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ. ఇవన్నీ ఒక వైపు మనకు తెల్సిన విషయాలు. ఇక మనకు తెలియని కధ మరో వైపు వుంది. అతిగా యాంకరింగ్ చేయడం అంటే ముఖ్యంగా వందలు, వేలాది మంది పాల్గొనే కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం అంటే గొంతు చించుకుని అరవాల్సిందే. వరుస కార్యక్రమాలు చేసీ చేసీ సుమ వాయిస్ కష్టాల్లో పడిందట. అంటే అదేదో ఆర్ధిక కష్టాలో మరొకటో కాదు.. కొన్ని రోజులుగా ఆమె గొంతు సంబంధమైన ఇబ్బందితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. యాంకరింగ్ ఇలానే కొనసాగిస్తే సుమ మరింత ఇబ్బందుల్లో పడుతుందని, పర్మినెంటుగా వాయిస్ క్రాక్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఒక వేళ యాంకరింగ్ చేసినా బిగ్గరగా అరవడం, గొంతు చించుకుని మాట్లాడటం లాంటివి చేయొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైద్యులు స్పష్టం చేసేసారట. అందుకే ఈ మధ్య కాలంలో సుమ అంతగా కనిపించడం లేదట. అయితే ప్రస్తుతం ఆమె గొంతు సంబంధమైన సమస్యల నుండి కోలుకుంటోందని అంటున్నారు. సుమ త్వరగా కోలుకుని గతంలోలా మళ్లీ యాక్టివ్ కావాలని ఆమె అభిమానులు వెడుకుంటున్నారట. మరి మునుముందు సుమ ఎలాంటి యాంకరింగ్ కార్యక్రమాల్లో చేయనుందో.

English summary

Anchor Suma was suffering from throat disease. Doctors said that you will not participate in functions and not do anchoring.