'నాగార్జున' పై కేసు పెట్టిన 'ఆంధ్రాబ్యాంక్‌'!!

Andhra Bank filed police case on Akkineni Nagarjuna

03:17 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Andhra Bank filed police case on Akkineni Nagarjuna

అక్కినేని నాగార్జున పై ఆంధ్రాబ్యాంక్‌ యాజమాన్యం పోలీస్‌ కేసు పెట్టింది. వివరాల్లోకెళితే అన్నపూర్ణ స్టూడియోస్‌ పేరు మీద ఆంధ్రాబ్యాంక్‌లో 37 కోట్లు అప్పు తీసుకున్నాడు నాగార్జున. ఆ 37 కోట్లు బాకీ తిరిగి చెల్లించమని ఆంధ్రాబ్యాంక్‌ వారు నోటీసులు పంపినా తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బోర్డ్‌ మెంబర్స్‌ అయిన అక్కినేని నాగార్జున, సుప్రియ యార్లగడ్డ, వెంకట్‌ అక్కినేని, నిమ్మగడ్డ ప్రసాద్‌ మరియు నాగ సుశీల అక్కినేనిల పై ఆంధ్రాబ్యాంక్‌ వారు పోలీస్‌ కేసు పెట్టారు. అంతే కాదు అన్నపూర్ణ స్టూడియోస్‌తో లోన్‌ క్లియర్‌ చేయించడానికి ఆంధ్రాబ్యాంక్‌ 'ఆర్‌బిఐ' బ్యాంక్ నుండి స్పెషల్‌ పవర్స్‌ కూడా తీసుకుంటుంది.

ఈ సంఘటనతో నాగార్జున అయోమయ స్థితిలో పడిపోయారని సమాచారం. నాగార్జున తాజాగా నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

English summary

Andhra Bank filed police case on Akkineni Nagarjuna due to 37 crores owe.