మార్చి 10న ఎపి బడ్జెట్

Andhra Pradesh Assembly Budget On March 10th

04:54 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Andhra Pradesh Assembly Budget On March 10th

బడ్జెట్ సమావేశాలు ఖరారవ్వడంతో బడ్జెట్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇక ఈ సమావేశాల్లోనే శీతాకాల సమావేశాల్లో వైసిపి ఎంఎల్ఎ రోజా తదితరులు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్యలు వుండే అవకాశం వుందని తెలుస్తోంది. కాగా సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ మార్చి 5నుంచి శాసనసభా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ మార్చి 10న శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జీఎస్‌డీపీ వృద్ధితోనే రెవెన్యూ పెరుగుతుందని పేర్కొన్నారు.

English summary

The Budget session of Andhra Pradesh State Legislature will begin from march 10th.Andhra Pradesh Finance Minister Yanamala Ramakrishnudu will present the state budget for 2016-17 financial year on March 10.