ఎపిలో తొలిసారిగా 'ఈ-బడ్జెట్‌'

Andhra Pradesh Budget 2016

10:36 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Andhra Pradesh Budget 2016

ఆంధ్రప్రదేశ్‌ 2016-17 బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశ పెట్టారు. అయితే ఈ సారి బడ్జెట్ కి ఓ ప్రత్యేకత వుంది. గతంలో ఎన్నోసార్లు మంత్రి యనమల బడ్జెట్ ప్రవేశ పెట్టినా, ఇప్పుడు  తొలిసారిగా 'ఈ-బడ్జెట్‌'ను రూపొందించారు. అందుకే సభ్యులకు ఈ-బడ్జెట్‌ కాపీలను ట్యాబ్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అబ్దుల్‌ కలాం సుభాషితంతో యనమల బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మొత్తం బడ్జెట్‌ రూ. 1,35,688.99 కోట్లుగా వెల్లడించారు. ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ.86,554.55కోట్లు , ప్రణాళిక వ్యయం రూ.49,134.44కోట్లుగా చూపించారు. గతేడాదితో పోలిస్తే 20.03శాతం బడ్జెట్‌ వృద్ధి చూపారు.

1/11 Pages

అమరావతికి రూ.1500 కోట్లు ......

 కాగా ఈ ఏడాది నుంచే ఎపిలో పాలనను పట్టాలెక్కించాలని భావిస్తున్న తరుణంలో నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ బడ్జెట్ లో 1500 కోట్లు కేటాయించారు. ఇక ఆకర్షణీయ వార్డులు, గ్రామాలకు రూ.3,100 కోట్లు, పారిశుద్ధ్యం కోసం రూ.320 కోట్లు, పట్టణ పరిపాలనకు రూ.4,728.95 కోట్లు , ఉపాధి హామీ పథకానికి రూ.4,764.71 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195.63 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.4,467 కోట్లు , క్రీడా శాఖకు రూ.215.38 కోట్లు కేటాయించారు. 

English summary

Andhra Pradesh Finance Minister Yanamala Rama Krishnudu presented the Budget of Andhra Pradesh in A.P. Assembly.This year the total budget ammount was Rs 1,35,689 crore, an increase of around 20 per cent compared with the previous budget.