సింధు కి సూపర్ గౌరవం - మాంచి ఆఫర్

Andhra Pradesh Government Honored PV Sindhu

11:31 AM ON 24th August, 2016 By Mirchi Vilas

Andhra Pradesh Government Honored PV Sindhu

ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు కి తెలుగు రాష్ట్రాల్లో అరుదైన గౌరవం లభించింది. హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికి, పూల వాన కురిపించి , 5 కోట్ల రూపాయలతో సత్కరిస్తే, ఎపి సీఎం కూడా విజయవాడకు ఆహ్వానించి తగురీతిలో సత్కరించారు. మొత్తానికి పోటాపోటీగా ఈ సత్కారాలు సాగాయి.

1/5 Pages

సింధుతో ఆడిన సీఎం చంద్రబాబు ....

సింధుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్యాడ్మింటన్ ఆడారు. విజయవాడలో సింధుకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ దీనికి వేదికైంది. వేదికపై సింధుతో పోటాపోటీగా చంద్రబాబు ఆడుతున్న సమయంలో స్టేడియం అంతా చప్పట్లతో మార్మోగింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన సింధు విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధును శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.

English summary

Andhra Pradesh Government Honored Olympic Silver Medalist PV Sindhu. Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu said that Gopi Chand will be honored with Doctorate by Andhra University. CM offered 1000 yards land, 3 crore prize money and Group-1 job for PV Sindhu.