ఇసుక ఇక ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Andhra Pradesh Government News Sand Policy

10:31 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Andhra Pradesh Government News Sand Policy

అవుననే అంటోంది ఏపీ ప్రభుత్వం... ఈమేరకు సంచలన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏపీలో ఉచితంగా ఇసుక తవ్వుకోని తీసుకెళ్లచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్డర్లు, ఇతర వర్గాలతో సోమవారం చర్చించాలని నిర్ణయించింది. దీంతో సోమ, మంగళవారాల్లో ఈ నిర్ణయం ఓ కొలిక్కి రానుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమీక్షిస్తూ, ' ఇసుక కొరతతో ప్రభుత్వ నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది.. ఇసుక పై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ. 200 కోట్లే దీని కోసం అక్రమాలకు పాల్పడ్డారనే చెడ్డపేరు ఎందుకు?' అని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కావాల్సిన వారు ప్రొక్లైనర్‌తో తవ్వుకొని తీసుకెళ్లవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. నిలువచేసి అమ్మితే నిత్యవసర వస్తువుల చట్టం కింద కేసులు పెడతామని అధికారులను సీఎం హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లనివ్వవద్దని..వెళ్లనివ్వకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత రెండేళ్లుగా ఇసుక బంగారం ధరను మించి పోయింది. నిర్మాణ రంగం కుదేలైంది. ఎట్టకేలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఆచరణలో ఏమౌతుందో చూడాలి .

English summary