ప్రత్యేక హోదాపై ఝలక్

Andhra Pradesh Special Status Issue

11:28 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Andhra Pradesh Special Status Issue

ఇప్పటివరకూ ప్రత్యేక హోదా పై ఎక్కడో దాగివున్న ఆశ కూడా ఆవిరైపోయింది. మొన్ననే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ కెవిపి రామచంద్రరావు ఇచ్చిన ప్రైవేట్ బిల్లు నోటీసుపై కేంద్రమంత్రి చౌదరి ప్రత్యేక హోదా ఎపికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పెయ్యగా, ఇప్పుడు మరింత ముందుకు వెళ్తూ , 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సిన్హా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైన మేరకు ప్రత్యేక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నీతిఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తామన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014-15లో 4,403 కోట్లు, 2015-16లో రూ.2వేల కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ద్రవ్యలోటు భర్తీ కింద రూ.2,803 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.850 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మొత్తానికి దీనిపై టిడిపి తో సహా ఎపిలోని పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

నేను అంత రొమాంటిక్ కాదు

మహేష్ బాబు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

వార్డు సొమ్ము హాస్పిటల్ కిచ్చేసిన క్రిష్

English summary

Special Status to Andhra Pradesh have been heating up with Central Government's Statements. One of the central minister said that there is no need of special status for Andhra Pradesh and now another statement was made by central minister by saying that there is no special status requirement for Andhra Pradesh.