ఎపి తాత్కాలిక  సచివాలయానికి శంకుస్థాపన

Andhra Pradesh Temporary Secretariat Foundation Ceremony

10:49 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Andhra Pradesh Temporary Secretariat Foundation Ceremony

ఈ ఏడాది నుంచి ఎపి నుంచే పాలన సాగించాలన్న ఉద్దేశ్యానికి అనుగుణంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. తొలుత నల్లూరు పండితులు శంకుస్థాపన ప్రాంతంలో ధాతుస్థాపన, రత్నాన్యాసం, ఇష్టికాన్యాసం పూజలు నిర్వహించారు. శాసనసభ స్పీకర్‌ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్రమంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, మాణిక్యాలరావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్‌, పరిటాల సునీత, పీతల సుజాత, ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు,టిడిపి నేతలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu foundation stone ceremony for A.p Temporary Secretariat in Velagapudi in Guntur District.Andhra Pradesh Assembly Speaker Kodela Shiva Prasad , Nimmakaayala China Rajappa, Yanamala Ramakrishnudu and some other leaders were participated in this ceremony