ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే హవా

Andhra Pradesh Tenth Results Out

12:56 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Andhra Pradesh Tenth Results Out

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారులు, ఉపాధ్యాయుల కృషితో రికార్డుస్థాయిలో అత్యంత వేగంగా ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్ష ఫలితాల్లో 94.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాల్లో బాలురు కంటే బాలికలు స్వల్పంగా ఆధిక్యం సాధించారు. పదో తరగతి పరీక్షలకు 6,17,030 మంది విద్యార్థులు హాజరుకాగా 5,83,266 మంది పాసైనట్లు మంత్రి తెలిపారు. మొత్తం 6,52,374 మంది విద్యార్థులు పరీక్ష రాయగా...5,83,266 మంది రెగ్యులర్‌ విద్యార్థులు,19,605 మంది ప్రైవేటు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 94.77గా నమోదైంది. గతేడాది కంటే ఉత్తీర్ణత 3 శాతం పెరిగింది.

ఇవి కూడా చదవండి:భార్యను చంపి సేమ్ 'దృశ్యం' సినిమా కధలా మలిచాడు

ఫలితాల్లో కడప జిల్లా 98.8 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి 97.65 శాతంతో రెండవస్థానం లో నిలవగా, తూర్పుగోదావరి 97.59 శాతంతో మూడవ స్థానం సాధించింది. ఇక చిత్తూరు జిల్లా 90.11 శాతంతో గతేడాది మాదిరిగా ఆఖరి స్థానంలో ఉండిపోయింది. ఫలితాల విడుదలతో నెట్ సెంటర్ల దగ్గర విద్యార్ధుల హడావిడి స్టార్ట్ అయింది.

ఇవి కూడా చదవండి:భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

English summary

Andhra Pradesh Education Minister Ganta Srinivasa Rao released SSC results 2016 in Vishakapatnam. Kadapa District , West Godavari,East Godavari Districts were in Top three positions and Chittoor District remains last in the percentage of Pass.