మోడల్ ని పెళ్లి చేసుకున్న కరీబియన్ ఆటగాడు!

Andre Russell married model

05:10 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Andre Russell married model

విధ్వంసకర ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న కరీబియన్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ జాసిమ్ ను వివాహం చేసుకుని తన బ్యాచులర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. డొమినిక్ రిపబ్లిక్ కు చెందని జాసిమ్ అనే మోడల్ తో రసెల్ శుక్రవారం నాడు రసెల్ వివాహం జరిగింది. చాలా ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 2014లో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. తన పెళ్లి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన రసెల్.. ఏ విషయంలోనైనా దేవుడినే ముందుండేలా చూసుకోవాలి.. ఆయనే మార్గం చూపిస్తాడు అంటూ ఫోటోకు కామెంట్ జత చేశాడు.

ఇక క్రికెటర్ గా రసెల్ నేపథ్యం కూడా ఆసక్తికరంగా మారింది. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ చేతబట్టిన రసెల్ తల్లి ఎంత వద్దని చెప్పినా.. మైదానంలోకి అడుగుపెట్టకుండా ఉండేవాడు కాదు. తండ్రికి కూడా రసెల్ క్రికెట్ ఆడడం ఇష్టం లేకపోయినా.. రసెల్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఆటపైనే ఫోకస్ చేస్తూ వచ్చాడు. అలా డొమెస్టిక్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్ గా సత్తా చాటాడు. ఇప్పుడు ఒక ఇంటివాడయ్యాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రసెల్..

Put God first and he will show you the way!!

A photo posted by Andre Russell (@ar12russell) on

English summary

Andre Russell married model