అవకాశాలు లేక వేశ్యగా మారిపోయిన ఆండ్రియా

Andrea turned as a prostitute

03:50 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Andrea turned as a prostitute

తొలుత సింగర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆండ్రియా ఆ తరువాత తన అందంతో హీరోయిన్ అయ్యే ఛాన్స్ కూడా కొట్టేసింది. 'విశ్వరూపం' తమిళ్ డబ్బింగ్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఆండ్రియా ఆ తరువాత డైరెక్ట్ తెలుగు సినిమా 'తడాఖా' లో సునీల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇంక మళ్లీ తెలుగు సినిమాల్లో నటించకపోయినా తమిళ్ డబ్బింగ్ చిత్రాలతో అలరించింది. అయితే ప్రస్తుతం ఆండ్రియా వేశ్యలా మారిపోయింది. అదేంటి తమిళంలో బాగానే సినిమాలు చేస్తున్నఆండ్రియా వేశ్యగా అయిపోవడమేంటి అనుకుంటున్నారా? అయితే మేటర్ లోకి వెళ్ళాల్సిందే. ధనుష్ హీరోగా నటించనున్న 'వడచెన్నై' చిత్రంలో ఆండ్రియా నటిస్తుంది.

ఇందులో ధనుష్ సరసన సమంత ఎంపిక కాగా.. ఇందులో ఆండ్రియా వేశ్యపాత్రలో కనిపించనుంది. ఇది మంచి కీలకమైన పాత్ర కావడంతో వేశ్యగా నటించడానికి ఆండ్రియా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్రతో వేశ్య పాత్రల్లోకి మంచి పేరు లభిస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ వడచెన్నై చిత్రం జూన్ 15న ప్రారంభం కానుంది. కాగా.. ప్రస్తుతం 'కోడి' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు ధనుష్. ఈ చిత్రం పూర్తవ్వగానే వడచెన్నై షూటింగ్ లో పాల్గొంటాడు. అయితే అవకాశాలు లేకపోవడంతో ఆండ్రియా వేశ్య పాత్రలో నటిస్తుందని కుడా సినీ జనాలు అనుకుంటున్నారు.

English summary

Andrea turned as a prostitute. Hot singer and actress Andrea Jeremiah turned as a prostitute. She is acting as a prostitute in Dhanush movie.