గుండె గుండెలో లేదు...

Andrew Jones is suffering from heart disease

02:48 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Andrew Jones is suffering from heart disease

మనిషికి గుండె ఎంతో ప్రధానం... గుండె ఆగిందో ఇక ప్రాణం పోయినట్టే... లబ్ డబ్ శబ్ధం నిత్యం వినిపించే గుండె కేవలం పిడికెడంత ఉంటుంది. గుండె మన ఛాతీలోపల ఉంటుందని అందరికీ తెలుసు. కానీ 26 ఏళ్ళ ఆండ్రూ జోన్స్ గుండె మాత్రం గుండెలో లేదు. మరెక్కడో వుంది. ఎక్కడంటే, అతని వీపుపై ఉండే సంచిలో ఉంటుంది. అతను కనెక్టికట్ లో ఉంటున్నాడు. అతనికి కార్డియోమయోపతి వ్యాధి రావడంతో కనీసం నడవడానికి కూడా శక్తి లేకుండా అయిపోయాడు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సచేయాలని డాక్టర్లు చెప్పారు. అతన్ని వేధిస్తున్న కార్డియోమయోపతి సామాన్యమైనది కాదు.

గుండె నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. అయితే, అవయవదానం ద్వారా గుండె దొరకకపోవడంతో అతనికి పేస్ మేకర్ ను, కృత్రిమ గుండెను అమర్చారు. ఆ కృత్రిమ గుండెకు రెండు గొట్టాలను ఓ యంత్రానికి అనుసంధానం చేసి, దానిని అతని వీపుపై ఉండే సంచిలో అమర్చారు. రక్త సరఫరాకు ఈ యంత్రం దోహదపడుతుంది. ప్రస్తుతం ఆండ్రూ జోన్స్ సాధారణంగానే తన పని తాను చేసుకోగలుగుతున్నాడు. జిమ్ కు వెళ్ళి ఎక్సర్ సైజులు కూడా చేస్తున్నాడు.

English summary

Andrew Jones is suffering from heart disease